Ads
మనందరికీ డ్రీమ్స్ ఉంటాయి. కానీ.. పరిస్థితుల వలనో, అవసరాల వలనో.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఓ రకమైన కంఫర్ట్ జోన్ లో బతికేస్తూ ఉంటాం. కానీ.. ఈ ఆటో వాలా అలా కాదు. తన కలను నెరవేర్చుకోడం కోసం ఇతను చేసిన పని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేం. పట్టుదల, సంకల్పం ఉంటె ఎంతటి పనినైనా సాధించవచ్చని ఈ ఆటో వాలా నిరూపించి చూపించాడు.
Video Advertisement
సాక్షి కధనం ప్రకారం , చెన్నై కి చెందిన అన్నాదురై కి పారిశ్రామిక వేత్త అవ్వాలని గట్టి కోరిక ఉండేది. కానీ.. అందుకు తగ్గట్లు చదువుకోవడానికి కానీ, ఏమైనా చేయడానికి గాని అతని వద్ద అంత డబ్బు లేదు. అయినా సరే అతను వెనుకాడలేదు. తన ఆటో నే ఓ పరిశ్రమ లా భావించి అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దాడు. అతని ఆటో ఎక్కిన వారు ఎవరైనా సరే మళ్ళి మళ్ళి అదే ఆటో ని ఎక్కాలని కోరుకుంటారు. అంతా ఆ ఆటో లో ఏమి ఉంది అంటారా..? ఏమి లేదో చూసాక మీరే చెప్పాలి.
కరోనా నిబంధనలను పాటిస్తూ శానిటైజర్ ని ఏర్పాటు చేసాడు. తన ఆటో లో ఎక్కిన వారికి మాస్క్ లు కూడా ఇస్తాడు. ఒక చిన్న ఫ్రిడ్జ్ ను అమర్చాడు. అంతే కాదు తన ఆటో లో ఎక్కిన వారు తినడానికి స్నాక్స్ ని కూడా ఏర్పాటు చేసాడు. అలాగే.. ఆటో లో ప్రయాణించే వారికోసం ఓ చిన్న టివి, ఓ ఐపాడ్ ను కూడా ఏర్పాటు చేసాడు. ఆటో లో ఎక్కిన వారు ఎవరైనా దర్జాగా జర్నీ చేయచ్చన్నమాట. ఈ హంగులు మాత్రమే కాదు.. తన ఆటో లో ఎక్కిన వారిని అన్నాదురై తొమ్మిది భాషల్లో స్వాగతిస్తాడు. అందరిని మర్యాదగా చూస్తాడు.
కస్టమర్లను అన్నాదురై దైవం లా భావించి గమ్యస్థానాలకు చేరుస్తాడు. దీనితో.. అతనంటే ఆ ఏరియా లో బాగా క్రేజ్ ఏర్పడింది. అతని స్టోరీ ప్రస్తుతం వార్తల్లోకెక్కింది. జులై 15 న హ్యూమన్స్ ఆఫ్ బాంబే లో కూడా అతని కధనం పోస్ట్ అవడం తో.. అన్నాదురై సోషల్ మీడియా లో బాగా ఫేమస్ అయిపోయాడు. అందరు అతని ఆలోచనకు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Watch Video:
End of Article