జహీరాబాద్ ఎంపీ బరిలో చెరకు కరణ్ రెడ్డి

జహీరాబాద్ ఎంపీ బరిలో చెరకు కరణ్ రెడ్డి

by Mounika Singaluri

Ads

పార్లమెంటు ఎన్నికల కోలాహలం మొదలైంది.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను మోహరించేందుకు ముమ్మర కసరత్తులు చేస్తుంటే చాలా మంది నేతలు ఎంపీలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్న జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బరిలో నిలిచేందుకు చాలా మంది నేతలు తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు..

Video Advertisement

ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నవారిలో ముఖ్యమైన నేత చెరుకు కరణ్ రెడ్డి..ఆధ్యాత్మిక వేత్తగా..జర్నలిస్టుగా ..రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా చిరపరిచతులైన కరణ్ రెడ్డికి అవకాశాలు అధికంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారం..

చెరుకు కరణ్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలతో పరిచయం ఉన్నవారందరికీ తెలిసిన పేరు. గత రెండు దశాబ్దాలుగా బీజేపీ పార్టీతో ఆయనది ప్రత్యేక అనుబంధం.. పార్టీలో క్రియాశీల పాత్ర పోషించే కరణ్ రెడ్డి.. కరడు గట్టిన హిందుత్వ వాది.. హిందువులకు ఏ కష్టం వచ్చినా.. హిందుత్వానికి ఎలాంటి ఆపద వచ్చినా అందరికంటే ముందు నిలుస్తారు కరణ్.. శారదాపీఠం స్వరూపానందేద్ర సరస్వతి స్వామి వారికి.. స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి హిందూ ధర్మ ప్రచార యాత్ర కోఆర్డినేటర్ గా 7500 కిలో మీటర్లు నడిచారు.. వెయ్యికి పైగా ఆలయాల్ని సందర్శించారు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వీరాభిమాని.

కరణ్ రెడ్డి జర్నలిస్టుగానూ సుప్రసిద్ధులు.. అనేక మీడియా సంస్థల్లో పని చేసిన కరణ్ రాజకీయ వ్యూహకర్తగానూ ఎంతో మంది నాయకులను ఎమ్మెల్యేలుగా..ఎంపీలుగా గెలిపించారు.. తెలంగాణలో పదేళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీకి..ఆంధ్ర ప్రదేశ్ లోని వైఎస్సార్సీపీ కి సైతం పార్టీ స్థాయిలోనూ వ్యూహరచనలో పాలు పంచుకున్నారు..

ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ పడుతున్నట్లు సమాచారం.. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.. జర్నలిస్టుగా.. ఆధ్యాత్మిక వేత్తగా ..ప్రజా సేవకుడిగా రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో చిరపరిచితులైన కరణ్ ను త్వరలో ఎంపీగా పార్లమెంటులో చూడాలని ఆశిద్దాం..


End of Article

You may also like