నాని “హాయ్ నాన్న” సినిమాలో… నాని “కూతురు” పాత్రలో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

నాని “హాయ్ నాన్న” సినిమాలో… నాని “కూతురు” పాత్రలో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

by kavitha

Ads

‘దసరా’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ ‘హాయ్ నాన్న’. ఇది నాని నటిస్తున్న 30వ చిత్రం. కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 21న రిలీజ్  కాబోతున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు.

Video Advertisement

ఇప్పటివరకు ‘నాని 30 ‘ వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీకి ‘హాయ్ నాన్న’ అని స్టోరీకి తగినట్టుగా టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో హీరో హీరోయిన్లుగా నాని, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ఈ మూవీలో నాని ఒక పాపకి తండ్రిగా నటిస్తున్నారు. మరి ఆ పాప ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
kiara-khannaహాయ్ నాన్న మూవీ ఓ తండ్రి, కూతుర్ల మధ్య జరిగే ఎమోషనల్ స్టోరి అని తెలుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్  చూస్తుంటే హీరో వైఫ్ చనిపోవడం, అతనికి ఒక పాప ఉండడం, ఆ పాపకి హీరోయిన్ ఫ్రెండ్ కావడం వంటి సీన్స్ కనిపించాయి. ఇక ఈ గ్లింప్స్ లో నాని కూతురిగా నటించిన పాప పేరు కియారా ఖన్నా. ఆమె పలు వాణిజ్య ప్రకటనలలో నటించింది. థాంక్‌ గాడ్, బందాసింగ్, బారాముల్లా, సాంబహదూర్ వంటి బాలీవుడ్ సినిమాలలో నటించింది. కియారాకు ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. తన అక్క మైరాతో కలిసి ఉన్న వీడియోలను షేర్ చేస్తుంది.
కియారా ఖన్నా తల్లి పేరు శివాని జె ఖన్నా. ఆమె తన పిల్లల పేర్లతో నిర్వహిస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు దాదాపు 328 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన పిల్లలు మైరా మరియు కియారా ఖన్నా నటించిన వీడియోలను క్రమం తప్పకుండా షేర్ చేస్తుంది. కియారా ఖన్నా మాక్స్ స్ప్రింగ్ యాడ్, క్లబ్ మహీంద్రా మరియు కెన్‌స్టార్ వంటి పలు యాడ్స్ లో నటించింది. ఆమె యూట్యూబ్ ఛానెల్ లో ఈ యాడ్స్ ను చూడవచ్చు.

https://www.instagram.com/p/CdXNXblgZ2-/

Also Read: “బ్రో” మూవీతో మరోసారి తన మార్క్ ను చూపించబోతున్న మాటల మాంత్రికుడు..

 


End of Article

You may also like