“బ్రో” మూవీతో మరోసారి తన మార్క్ ను చూపించబోతున్న మాటల మాంత్రికుడు..

“బ్రో” మూవీతో మరోసారి తన మార్క్ ను చూపించబోతున్న మాటల మాంత్రికుడు..

by kavitha

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధ‌ర‌మ్‌తేజ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో. ఈ మూవీ కోలీవుడ్ లో విజయం సాధించిన వినోద‌య సిత్తం మూవీకి రీమేక్ గా తెరకెక్కుతోంది. పవన్ నటించిన బ్రో మూవీ జూలై 28న  థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చారు.

Video Advertisement

రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ప్రారంభిస్తారనే టాక్ వినిపిస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. బ్రో చిత్రంలో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, ఉంటాయని సమాచారం. తాజాగా ఈ మూవీ గురించిన ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
Trivikramపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రంలో వచ్చే క్లైమాక్స్ సన్నివేశం ఎంత అద్భుతంగా ఉందో, ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంలో క్లైమాక్స్ ముఖ్యమైన పాత్రను పోషించింది.
ప్రస్తుతం తెరకెక్కుతున్న బ్రో మూవీలో కూడా అత్తారింటికి దారేది మూవీ వంటి ఎమోషనల్ క్లైమాక్స్ ను త్రివిక్రమ్ పెట్టినట్టు తెలుస్తోంది. బ్రో మూవీ క్లైమాక్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ ఉంటుందని సమాచారం. 2023 లో బ్రో మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అలాగే  బ్రో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బ్రో మూవీకి అఖండ మూవీ రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను ఊహించుకోవద్దని ఫ్యాన్స్ కు ఇంటర్వ్యూలలో ఇప్పటికే చెబుతూ వస్తున్నారు. ఇక బ్రో సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బ్రో మూవీతో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తమ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read: “బేబీ” గురించి షన్ను అప్పుడే చెప్పేసాడా..? ఈ వీడియో చూసారా..?

 


End of Article

You may also like