“బేబీ” గురించి షన్ను అప్పుడే చెప్పేసాడా..? ఈ వీడియో చూసారా..?

“బేబీ” గురించి షన్ను అప్పుడే చెప్పేసాడా..? ఈ వీడియో చూసారా..?

by kavitha

Ads

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన సినిమా బేబీ. ఈ సినిమాకి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లకి, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజ్ అయిన బేబీ ట్రైలర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

Video Advertisement

ఈ క్రమంలో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటించిన ఒక షార్ట్ ఫిల్మ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానిని చూసిన నెటిజెన్లు బేబీ గురించి షణ్ణు అప్పుడే చెప్పేసాడా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
Babyఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ మూవీ జులై 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కు ఇప్పటిదాకా ఆరు మిలియన్ల వ్యూస్ లభించాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ ముక్కోణపు ప్రేమకథ విజయం సాధిస్తుందని మూవీ యూనిట్, ట్రైలర్ ను చూసిన ఆడియెన్స్ భావిస్తున్నారు.
ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత సోషల్ మీడియాలో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ నటించిన ఒక షార్ట్ ఫిల్మ్ వీడియో వైరల్ గా మారింది. అందులో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా నటించింది. అందులో హీరోయిన్ అందంగా లేదని బ్రేక్ అప్ చెప్తాడు. ఆ తరువాత ఆమె గ్లామర్, అందంగా మారుతుంది.ఈ వీడియో చివర్లో ‘అమ్మాయిలు మనం ప్రేమించేటపుడు ఆధార కార్డ్ లో ఫోటోలా ఉంటారు. అదే మనం వదిలేసిన తరువాత ఇన్ స్టాగ్రామ్ లో మోడెల్స్ లా ఉంటారు’ అని చెప్తాడు. బేబీ ట్రైలర్ లో కూడా హీరోయిన్ ముందు డార్క్ మేకప్ లో ఉంటుంది. కాలేజీలో జాయిన్ అయిన తరువాత ఆమెలో మార్పు వస్తుంది. ఇది చూసిన నెటిజెన్లు “బేబీ” గురించి షణ్ణు అప్పుడే చెప్పేసాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: అసలు ఏంటి ఈ సినిమా..? పవన్ కళ్యాణ్ రీమేక్ చేసే అంతగా ఏం ఉంది ఇందులో..?


End of Article

You may also like