ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆ తర్వాత ఇండస్ట్రీలోనే ఎంతో గొప్ప హీరో అయ్యారు..! ఎవరో కనిపెట్టగలరా..?

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆ తర్వాత ఇండస్ట్రీలోనే ఎంతో గొప్ప హీరో అయ్యారు..! ఎవరో కనిపెట్టగలరా..?

by Mohana Priya

Ads

సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి రావడం చిన్న విషయం కాదు. అలా వచ్చాక ఇండస్ట్రీలో తమకంటూ గుర్తింపు తెచ్చుకోవడం ఇంకా పెద్ద విషయం. ఎన్నో ఏళ్ళు కష్టపడాలి. ఎంతో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సినిమాలు కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా సహనం ఎక్కువగా ఉండాలి. వెంటనే సక్సెస్ వచ్చేయదు. అది రావడానికి చాలా సమయం పడుతుంది. ఎంత సమయం పట్టినా కూడా ఎదురు చూడాలి. ఇలాంటివన్నీ చేస్తేనే ఇండస్ట్రీలో గొప్ప నటులు అవుతారు. ఇది నిరూపించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు.

Video Advertisement

childhood picture of hero

కానీ వాళ్లందరి ప్రయాణం అంత సులువుగా జరగలేదు. వాళ్లు కూడా ఎన్నో కష్టాలు పడి ఇంత గొప్ప గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ వాటి గురించి ఎక్కువగా ఎక్కడా మాట్లాడరు. ఎందుకంటే ఏదైనా ఒక గొప్ప గుర్తింపు తెచ్చుకోవాలి అని కష్టపడుతున్నప్పుడు ఇలాంటివి అవ్వడం సహజం అని వాళ్ళు అనుకుంటారు. పైన ఫోటోలో ఉన్న వ్యక్తి కూడా అలాగే సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తర్వాత తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకొని ఇవాళ సినిమాల ద్వారా అందరి గుండెల్లో నిలిచిపోయారు. ఒక మార్గదర్శి అయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు గారు. తెలుగు సినిమా గర్వపడే నటుల్లో ఒకరు. ఎన్నో కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు గారు చేసేవారు.

నాగేశ్వరరావు గారి ప్రయాణం అంత సులువుగా జరగలేదు. ఎంతో కష్టపడి టాప్ నటుల్లో ఒకరిగా ఎదిగారు. ఆ తర్వాత నాగేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు కూడా సినిమాల్లోకి రావడం మొదలుపెట్టారు. పైన ఉన్న ఫోటోలో ఒక ఫోటో అక్కినేని నాగేశ్వరరావు గారి చిన్ననాటి ఫోటో అయితే, ఒక ఫోటో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక డ్రామా సమయంలో ఆడవేషధారణలో రెడీ అయిన ఫోటో. ఎన్నో సంవత్సరాల తన సినీ ప్రస్థానంలో ఎన్నో వందల పాత్రలు పోషించారు. కొత్త కథలను ప్రోత్సహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ అనే స్టూడియోస్ ఏర్పాటు చేసి హైదరాబాద్ లో షూటింగ్స్ జరగడానికి ఒక దారి ఏర్పాటు చేశారు. మద్రాస్ నుండి తెలుగు సినిమాని తెలుగు రాష్ట్రాలకు తీసుకురావడానికి తన వంతు కృషి చేశారు.


End of Article

You may also like