Ads
సాధారణంగా ఎక్కడైనా సరే ఒక మనిషి ఒక వయసు వరకు పని చేస్తారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. కొన్నిసార్లు వయసు కూడా సహకరించదు. అలాంటి సమయంలో విశ్రాంతి చాలా అవసరం. అందుకే, ఏ మనిషి అయినా సరే ఒక వయసు వరకు మాత్రమే పని చేస్తారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకొని ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతుంటారు.
Video Advertisement
కానీ కొంత మంది మాత్రం ఒక వయసు వచ్చిన తర్వాత కూడా పని చేస్తూనే ఉంటారు. వారికి ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఏదో ఒక మార్గాన్ని వెతుక్కొని దాని ద్వారా వాళ్ళు పనిచేస్తారు. అలా ఒక వ్యక్తి 95 సంవత్సరాలు వచ్చినా కూడా పనిచేస్తూనే ఉన్నారు. ఆమె పేరు చిలుకూరి శాంతమ్మ. శాంతమ్మ గారు మచిలీపట్నంలో జన్మించారు.
శాంతమ్మ గారికి ఐదు నెలల వయసు ఉన్నప్పుడు తండ్రి చనిపోవడంతో, ఆవిడ బంధువుల దగ్గర పెరిగారు. ఏవీఎన్ కాలేజీలో ఇంటర్ చదివారు. ఆంధ్ర యూనివర్సిటీలో బీఎస్సీ ఆనర్స్ చదివారు. శాంతమ్మ గారికి భౌతిక శాస్త్రం అంటే చాలా ఇష్టం ఉండడంతో అందులోనే చదివి మహారాజా విక్రం దేవ్ వర్మ నుండి భౌతిక శాస్త్రంలో బంగారు పతకాన్ని కూడా అందుకున్నారు. అంతే కాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీలో పిహెచ్‌డికి సమానం అయిన డీఎస్సీ అనే డిగ్రీని కూడా పూర్తి చేశారు.
1956 లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కాలేజ్ ఆఫ్ సైన్స్ లో ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేసిన శాంతమ్మ గారు, ఆ తర్వాత ప్రొఫెసర్, ఇన్వెస్టిగేటర్, రీడర్ వరకు అనేక బాధ్యతలు చేపట్టారు. 1989 లో పదవీ విరమణ చేశాక కూడా, ఆమెకి ఇంకా పాఠాలు చెప్పాలి అనిపించింది. దాంతో మళ్లీ ఆంధ్ర యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరి ఆరేళ్లు పనిచేశారు. ఏయు వీసీ సింహాద్రి గారి గౌరవ వేతనం మీద ప్రొఫెసర్ గా శాంతమ్మ గారిని కొనసాగించారు. ఆ తర్వాత జి.ఎస్.ఎన్ రాజు గారు వీసీగా పద్ధతులు చేపట్టారు. ఈయన శాంతమ్మ శిష్యుడు. ఆ తర్వాత రాజు గారు సెంచూరియన్ యూనివర్సిటీకి వీసీగా మారారు.
దాంతో శాంతమ్మ గారు కూడా ఇదే యూనివర్సిటీలో పాఠాలు చెబుతున్నారు. విశాఖ నుండి 60 కిలో మీటర్లు ప్రయాణించి శాంతమ్మ గారు రోజు వర్సిటీకి వెళ్తున్నారు. వారానికి 4 తరగతులు బోధిస్తున్నారు. అయితే శాంతమ్మ గారి రెండు మోకాళ్ళకి ఆపరేషన్ జరిగింది. ఈ కారణంగా శాంతమ్మ గారు రెండు కర్రల సహాయంతో తన వృత్తిని కొనసాగిస్తున్నారు. శాంతమ్మ గారి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, శాంతమ్మ గారి భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయన ఒక తెలుగు ప్రొఫెసర్.
ఆయన కొద్ది సంవత్సరాల క్రితమే తుది శ్వాస విడిచారు. శాంతమ్మ గారికి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువగా ఉండటంతో ఆమె భర్త ద్వారా ఉపనిషత్తుల గురించి తెలుసుకొని, ఆ తర్వాత భగవద్గీతను అధ్యాయనం చేసి ఇంగ్లీషులోకి అనువదించారు అంతే కాకుండా వేద గణితంలోని 29 సూత్రాలపై కూడా పరిశోధనలు చేసి, ఈ విషయం మీద ఏడు సంపుటాలు రాశారు ఇప్పటికి కూడా శాంతమ్మ గారు యాంటీ క్యాన్సర్ డ్ర-గ్ మీద ఆమె పరిశోధన చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఆమె పరిశోధనని శాంతమ్మ గారు కొనసాగిస్తూనే ఉన్నారు.
ALSO READ : “నా భార్య పరువు తీయద్దు” అంటూ…తండ్రిపై ఫైర్ అయిన “రవీంద్ర జడేజా”.! అసలేమైంది.?
End of Article