“నా భార్య పరువు తీయద్దు” అంటూ…తండ్రిపై ఫైర్ అయిన “రవీంద్ర జడేజా”.! అసలేమైంది.?

“నా భార్య పరువు తీయద్దు” అంటూ…తండ్రిపై ఫైర్ అయిన “రవీంద్ర జడేజా”.! అసలేమైంది.?

by Mounika Singaluri

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వ్యక్తిగత సమస్యలు ఇప్పుడు బయటికి వచ్చాయి. ఈ సమస్యలు ఎప్పుడో ఉన్నా కూడా బయటికి పెద్దగా తెలియనివ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం వీటి గురించి బహిరంగంగానే చర్చలు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే, రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.

Video Advertisement

అందులో, రవీంద్ర జడేజా తనకి సంబంధం లేదు అని చెప్పారు. అందుకు కారణం రవీంద్ర జడేజా భార్య, తన కోడలు అయిన రివాబా జడేజా అని చెప్పారు. అసలు రవీంద్ర జడేజా క్రికెట్ వైపు వెళ్లకపోతే బాగుండేది అని అన్నారు. ఒకే ఊరిలో ఉంటున్నా కూడా వారు మాట్లాడుకోవట్లేదు అని, తన మనవరాల్ని చూసి దాదాపు 5 సంవత్సరాలు అయ్యింది అని అన్నారు.

ravindra jadeja post about his father comment

ఈ విషయంపై అనిరుధ్ సింగ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “రవీంద్ర జడేజా కి పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేశాను. అసలు అతను క్రికెటర్ అవ్వకపోతే బాగుండేది. మూడు నెలల్లోనే అన్ని తనకి చెందేలాగా మార్చాలి అని జడేజా భార్య చెప్పింది. అలా మా కుటుంబంలో చిచ్చు రేపింది. అందరితో కలిసి ఉండాలి అనే ఉద్దేశం జడేజా భార్యకి లేదు. తను వేరుగా ఉండాలి అనుకునేది. నేను, రవీంద్ర జడేజా సోదరీ నైనా ఈ విషయాలు చెప్తే అవి తప్పు అనుకోవచ్చు. మా కుటుంబంలో ఉన్న 50 మంది ఇదే విషయం చెప్తారు. వాళ్లని కూడా తప్పు అంటారా? ఇప్పుడు మా కుటుంబంలో ద్వేషం మాత్రమే ఉంది” అని రవీంద్ర జడేజా తండ్రి చెప్పారు.

ravindra jadeja post about his father comment

అయితే ఈ విషయం మీద సోషల్ మీడియా ద్వారా రవీంద్ర జడేజా స్పందించి మరొక రకమైన కామెంట్స్ చేశారు. ఇంటర్వ్యూ అంతా స్క్రిప్టెడ్ అని, వాటిని అంత పట్టించుకోకపోవడం మంచిది అని అన్నారు. రవీంద్ర జడేజా గుజరాతిలో ఒక పోస్ట్ రాశారు. అందులో రవీంద్ర జడేజా ఈ విధంగా అన్నారు. “ఇంటర్వ్యూలో మాట్లాడినవన్నీ అర్థం లేనివి, అవి నిజం కూడా కాదు. ఇదంతా ఒక వైపు నుండి మాత్రమే ఆలోచించి మాట్లాడినవి.  వీటిని కూడా నేను వ్యతిరేకిస్తున్నాను. నా భార్య ఇమేజ్ ని తగ్గించడానికి మాట్లాడిన ఈ మాటలన్నీ కూడా తప్పు. నేను చెప్పాల్సినవి కూడా చాలా ఉన్నాయి. కానీ అవన్నీ నేను బహిరంగంగా చెప్పను” అని రాశారు.

ALSO READ : బాలరాముడి రాకతో అక్కడ ఆర్ధిక పరిస్థితి ఇంతలా మారనుందా.? ఏడాదికి అన్ని వేల కోట్ల ఆదాయమా.?


You may also like

Leave a Comment