Ads
సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమా ఇది. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు. సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ.
Video Advertisement
రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తెర మీద హైలెట్ బాలకృష్ణ అయితే, తెర వెనకాల హీరో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పాటలతో పాటు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రతి సీన్ హైలెట్ అవ్వడానికి ఒక కారణంగా నిలిచింది.
అయితే..ఈ సినిమా సూపర్ హిట్ సాధించడం పై బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. గత వారం తన సేవక బృందంతో కలిసి ఈ సినిమాను చూసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వివరిస్తూ ఆయన ఒక వీడియోను చేసారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధర్మానికి ఎలా నష్టం వాటిల్లుతోందో ఈ సినిమాలో చూపించారన్నారు.
అహింస పరమో ధర్మః అన్న వాక్యానికి వ్యతిరేకంగా ఎలా నడుస్తున్నారో ఈ సినిమాలో చూపించారని అన్నారు. ధర్మాన్ని రక్షించడం కోసం ఎంతకైనా తెగించవచ్చన్న విషయాన్నీ ఈ సినిమాలో చూపించారని అన్నారు. ధర్మాన్ని రక్షించడం కోసం అందరు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అందరు ఈ సినిమాను ఎందుకు చూస్తున్నారు..?
అందరి మనసుల్లోనూ ఆవేదన ఉంది. తపన ఉంది.. ఆక్రోశం ఉంది.. ఏమి చేయలేకపోతున్నామన్న బాధ కూడా ఉంది. రామరాజ్యం కోసం అంతా ఎదురు చూస్తున్నారు. కానీ ఏమి చేయలేని పరిస్థితి. అందుకే ఈ సినిమా అంత హిట్ అయింది. పాలకులు కూడా ఈ విషయాన్నీ అర్ధం చేసుకోవాలి.. అంటూ చెప్పుకొచ్చారు.
End of Article