Ads
“కారవాన్స్” సినిమా షూటింగ్ గ్యాప్లో రిలాక్స్ అవ్వడానికి, ఔట్ డోర్ షూటింగ్ అయితే హీరోయిన్స్ వారి కాలకృత్యాలు తీర్చుకోవడానికి , బట్టలు మార్చుకోవడానికి,మేకప్ వేసుకోవడానికి అందుబాటులో ఉండేవి. ఒకప్పుడు కారవాన్స్ లేని టైంలో చెట్టు చాటుకి బట్టలు మార్చుకున్న సంఘటనలు కూడా ఆ కాలం హీరోయిన్లు చెప్తుంటారు. మన సౌలభ్యం కోసం వచ్చిన వాటిని దుర్వినియోగం చేస్తే నష్టపోయేది మనమే. ప్రజెంట్ కారవాన్స్ విషయంలో జరుగుతున్న చర్చ అలాంటిదే.
Video Advertisement
కారవాన్స్ ని అవసరాలకు వాడుకోవాలి తప్ప లగ్జరీలకు కాదని చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పదేళ్ల క్రితం శంకర్ దాదా సినిమా షూటింగ్ అప్పుడు నేనే అభిప్రాయపడ్డా నాతో పాటు మిగతా నటులకి కూడా కారవాన్స్ ఉంటే బాగున్ను కదా అని, కానీ ఈ పదేళ్లల్లో పరిశ్రమలో చాలా మార్పులొచ్చాయి. నా వరకు నేను వాష్ రూం కి వెళ్లడానికి,మేకప్ వేసుకోవడానికి తప్ప మరేదానికి కారవాన్ వాడేవాన్ని కాదు, అందరికి వాళ్ల అవసరాల మేరకే కారవాన్స్ ఉండాలని కోరుకున్నా, కాని ప్రజెంట్ షాట్ కి షాట్ కి గ్యాప్లో వెళ్లిపోయి కారవాన్లో కూర్చుంటున్నారు.అది సరైంది కాదని కామెంట్ చేశారు.
Also read: సంచలన కామెంట్స్ చేసిన సీనియర్ నటి కవిత…వీపులు గోకేది వాళ్లే అంట.!
కారవాన్ ని ప్రెస్టేజ్ సింబల్ గా చూస్తున్నారు. చిన్న నటులు స్పాట్లో ఉన్నారు నేను వాళ్లతో కూర్చోవడం ఏంటి అని నామోషి ఫీల్ అవుతున్నారు. కానీ షూటింగ్ స్పాట్లో ఉండడం వలన ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది ఉంటుంది. అలా కాకుండా గ్యాప్ దొరకగానే వెళ్లి వాన్ ఎక్కి కూర్చుంటే అసిస్టంట్లకు యాక్టర్స్ ని పిలుచుకోవడానికే సగం టైం సరిపోతుందని అసహనం వ్యక్తం చేశారు.ఒకప్పుడు షూటింగ్ గ్యాప్లో నెక్స్ట్ సీన్ ప్రాక్టీస్ చేసేవాళ్లం, దీనివల్ల నటీనటులందరి మధ్య ఫ్రెండ్లీ నేచర్ ఉండేదని, కుటుంబ సభ్యుల్లా కలిసిపోవడానికి తోడ్పడేదని ,ప్రెజెంట్ అలా ఎక్కడా కనిపించట్లేదని అన్నారు.
చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్క హీరో ,హీరోయిన్ కి కారావాన్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. ఇది నిర్మాతకి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం . ఇదే విషయాన్ని చిరంజీవి ప్రస్తావించారు.కానీ ప్రస్తుతం దానిని ఉపయోగించుకోవడం కంటే ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
చిరంజీవి చేసిన వ్యాఖ్యల పట్ల ఇండస్ట్రీలో మరికొందరు రెస్పాండ్ అయ్యారు. ప్రొడ్యూసర్స్ కి బర్డెన్ అని చిరంజీవి గారంటున్నారు, కాని ప్రొడ్యూసర్సే హీరోయిన్ల వీపులు గోకే రకం అని మండిపడ్డారు సీనియర్ నటి కవిత. ఒకసినిమా చేసేటప్పుడు హీరోయిన్ తన కారవాన్ ని వాడుకోనివ్వలేదని, అక్కడే ఉన్న ప్రోడ్యూసర్ నోరు మెదపలేదని తనకి ఎదురైన చేదు అనుభవం చెప్పుకున్నారు.
“కారవాన్” సంస్కృతిపై ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంతా మండిపడుతుంది. కొంత మందికి పెద్ద హీరోలకి సొంతంగా కారవాన్స్ ఉన్నాయి. మిగతావారికి ప్రొడ్యుసరే కారవాన్స్ ఏర్పాటు చేయాలి.చిరంజీవి వ్యాఖ్యలతో తమ్మారెడ్డి భరద్వాజ ఏకీభవిస్తూ “చిరంజీవి చెప్పింది నిజం, షూటింగ్ స్పాట్లో తోటి ఆర్టిస్టులతో సరదాగా మెలిగితే పనులు త్వరగా అవుతయి, షూటింగ్ స్పాట్లో హెల్తీ వాతావరణం ఉంటుందని చెప్పుకొచ్చారు.
నిర్మాత అంబికా కృష్ణ, నటుడు ,నిర్మాత మురళీ మోహన్ కూడా చిరంజీవి చేసిన కామెంట్స్ తో ఏకీభవించారు . చిరంజీవి గారి కామెంట్స్ కి ఒక నిర్మాతగా సంతోషిస్తున్నానని అంబికా కృష్ణ అభిప్రాయపడ్డారు. తన అనుభవంతో చెప్పిన మాటలు అక్షరసత్యాలు. సినిమా ఇండస్ట్రీకి నిర్మాత వెన్నెముక .అటువంటి నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. చిరంజీవి గారు నిర్మాతల కష్టం గుర్తించారు కాబట్టి అలా మాట్లాడగలిగారు. అంటూ చిరంజీవి వాక్యల పట్ల ఆనందం వ్యక్తం చేశారు అంబికా కృష్ణ.
చిరంజీవి కామెంట్స్లో ఇండస్ట్రీలో కారవాన్స్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని అర్దమవుతోంది, చూడాలి ఈ చర్చ ఎటు దారితీస్తుందో? ఎలాంటి నిర్ణయాలు అమలు చేసేలా చేస్తుందో?
End of Article