సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త సినీ, రాజకీయ ప్రముఖులను షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. తెలుగు వారి అల్లూరి సీతా రామ రాజు అయిన సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య సమస్యల వల్ల తుదిశ్వాస విడిచారు. ఎందరికో సాధ్యం కానీ ఎన్నో రికార్డులను ఆయన తన ఖాతాలో వేసుకున్నారు.

Video Advertisement

దాదాపు 340కి పైగా చిత్రాల్లో నటించారు సూపర్ స్టార్ కృష్ణ. పైగా ఓ ఏడాది అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోగా నిలిచారు కృష్ణ. ఇదిలా ఉండగా కృష్ణ కి అప్పట్లో ఏకంగా 2500 అభిమానులు సంఘాలు ఉండేవి.

what happened to super star krishna..??

అయితే దానిలో ఒక దానికి మెగా స్టార్ చిరంజీవి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. గతం లో చిరంజీవి కూడా ఈ విషయాన్ని చెప్పారు. చిరు కృష్ణ గారి సూర్తి తోనే సినిమాల్లోకి వచ్చారట. పైగా కృష్ణ ఫ్యాన్స్ క్లబ్స్ కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక తమిళనాడు, కర్ణాటకలోనూ ఉండేవట. నిజంగా ఎంత గొప్ప విషయంలో కదా..? తోడు దొంగలు అనే సినిమా కూడా చేసారు కృష్ణ.

1981లో ఈ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాకి ముందు ‘పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్’ పేరు మీద ఓ కర పత్రాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే గౌరవ అధ్యక్షుడిగా చిరంజీవి పేరు ఆ ఫ్యాన్స్ యూనిట్ కి ఉండడం విశేషం. ఆ కరపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో షికార్లు కొడుతోంది. ఇందులో హానరబుల్ ప్రెసిడెంట్ అని చిరంజీవి పేరు ఉంది. అయితే ఇది ఒక్కసారి గమనిస్తే సినీ నటుడు చిరంజీవి అని ఉంది. అంటే చిరంజీవి అప్పటికీ సినిమాల్లో ఉన్నారు.

సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా చిరంజీవి కృష్ణ అభిమానుల సంఘానికి ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. ఇది చూసిన వాళ్ళు అందరూ కూడా చిరంజీవి కృష్ణ అంటే ఇంత అభిమానం అని అనుకోలేదు అని అంటున్నారు. ఇది కృష్ణ హీరోగా నటించిన తోడుదొంగలు అనే సినిమాకి ముందు విడుదల చేశారు. అలాగే సినిమాల్లో మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా చిరంజీవి కుటుంబానికి, కృష్ణ గారి కుటుంబానికి చాలా మంచి స్నేహం ఉంది.