చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదల అయ్యింది. చిరంజీవికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కథపరంగా, నటనపరంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చాలా కొత్తగా ఉన్నా కూడా సినిమా ఫలితం ఆశించిన విధంగా రాలేదు. దాని తర్వాత వచ్చిన ఆచార్య సినిమా కూడా ప్రేక్షకులని నిరాశపరిచింది.

Video Advertisement

దాంతో ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. కానీ తెలుగులో చాలా మార్పులు చేశారు. ఆ మార్పులు కూడా చాలా వరకు తెలుగు ప్రేక్షకులకు నచ్చాయి. అయితే ఈ సినిమాలో చిరంజీవి ఎంట్రీ చాలా బాగుంది అని అంటున్నారు.

godfather movie review

గాడ్ ఫాదర్ లో ఈ సీన్ కి రజినీకాంత్ కి ఉన్న సంబంధం ఉందట. మరి అదేమిటో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి ఇంట్రడక్షన్ ని బాగా చిత్రీకరించారు డైరెక్టర్. ఇక ఇంతకీ గాడ్ ఫాదర్ లో ఈ సీన్ కి రజినీకాంత్ కి ఉన్న సంబంధం ఏమిటనేది చూస్తే.. రజినీకాంత్ గారి లైఫ్ లో ఓసారి సీఎం కాన్వాయ్ వస్తోందంటే రజినీకాంత్ గారి కార్ ని ఆపేశారట. దానికి దగ్గరలో సీన్ మెగాస్టార్ గాడ్ ఫాదర్ లో వుంది.

chiranjeevi god father scene is similar to rajinikanth real life incident

 

ఇంతకీ ఏమైందనేది చూస్తే.. టెలిగ్రాఫ్ ఇండియా కథనం ప్రకారం, ఒకరోజు ట్రాఫిక్ లో రజినీకాంత్ వున్నారు. ఇంతలో ఓ ట్రాఫిక్ పోలీస్ వచ్చి సీఎం వెళ్తారు అందుకే వాహనాలని తీయకూడదు అని చెప్పారు. దానికి రజినీకాంత్ ఎంత సమయం పడుతుంది అని అడిగారు అరగంట అని బదులిచ్చారు. అయితే అరగంట సేపు ఏ కారు వెళ్లడానికి పట్టదు కదా ఎందుకు అందర్నీ ఆపేశారు అని అడిగారు. దానికి ట్రాఫిక్ పోలీస్ క్షమించండి సార్ ఆర్డర్స్ అని చెప్పారు.

chiranjeevi god father scene is similar to rajinikanth real life incident

image source : Twitter (The Illusionist)

ఇంతలో రజనీకాంత్ కారు నుండి బయటికి వచ్చి ఒక కొట్టు దగ్గర ఆగి సిగరెట్ తీసుకుని వెలిగించారు. సెకండ్లలో జనం చేరిపోయారు. ఇంకా కొన్ని నిముషాలలో జయలలిత ఆ రోడ్డు మీద నుంచి వెళ్లాలి. కానీ ఆ ప్రాంతమంతా కూడా జనంతో నిండిపోయింది. పోలీసు వచ్చి రజినీకాంత్ ని వెళ్ళమన్నారు.

godfather movie review

జయలలిత వెళ్లారు అని చెప్పారు. నేను ఎదురు చూడడానికి నాకు ఇబ్బంది లేదని.. ఆమె వెళ్తారని నేను కూడా చూస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత ఓ సారి స్పీచ్ లో జయలలితకి ఓటు వేస్తే దేవుడు కూడా రక్షించలేరని రజినీకాంత్ చెప్పారు. ఈ తరహా సన్నివేశాన్ని చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా లో పెట్టారు. అలానే జైల్లో వచ్చే సీన్ కూడా చాలా అద్భుతంగా వుంది. ఇలా కొన్ని సీన్స్ ప్రేక్షకులకి నచ్చేస్తాయి.