Ads
టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరోలలో విజయ్ ఒకరు. విజయ్ సినిమాలు చాలా వరకు తెలుగులో డబ్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి. తుపాకీ,జిల్లా ,పోలీస్ ,అదిరింది ,సర్కార్ ,విజిల్ ,మాస్టర్ లాంటి సినిమాలతో పాటు రీసెంట్గా విడుదలైన వారసుడు వరకు విజయ్ సినిమాలు ఎన్నో తెలుగులో మంచి సక్సెస్‌ను అందుకున్నాయి.
Video Advertisement
ఈ నేపథ్యంలో త్వరలో విడుదల కాబోతున్న అతని సరికొత్త చిత్రం లియో పై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు తెరకు సుపరిచితుడైన విజయ్ తండ్రి ఎన్ ఎ చంద్రశేఖర్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు క్రేజీ ప్రాజెక్టులకు చంద్రశేఖర్ దర్శకత్వ బాధ్యతలు వహించారు. విజయ్ తండ్రి తెలుగు సినీ దర్శకుడు అన్న విషయం పెద్దగా ఎవరికి తెలియని సంగతి.
ముఖ్యంగా అతను ఎక్కువ శాతం మెగాస్టార్ తో సినిమాలు చేశారు. మరి అవి ఏమిటో తెలుసుకుందామా…
#1 చట్టానికి కళ్లులేవు :
1981 లో ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకుడిగా తెరకెక్కిన చట్టానికి కళ్ళులేవు మూవీలో చిరంజీవి ,మాధవి జంటగా నటించారు. ఇందులో లక్ష్మి చిరంజీవి సిస్టర్ క్యారెక్టర్ లో ఓ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు.
#2 పల్లెటూరి మొనగాడు:
1983 లో ఎస్.ఎ.చంద్రశేఖర్ డైరెక్షన్‌లో రాధిక ,చిరంజీవి కాంబినేషన్‌లో విడుదలైన పల్లెటూరు మొనగాడు మూవీ మిశ్రమ ఫలితాలను దక్కించుకుంది.
#3 దేవాంతకుడు :
1984 లో చిరంజీవి మరియు విజయశాంతి జంటగా ఎస్.ఎ.చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన దేవాంతకుడు చిత్రం మంచి సక్సెస్‌ని అందుకుంది.
చిరంజీవితో చేసిన ఈ చిత్రాలే కాకుండా బలిదానం ,దోపిడీ దొంగలు ,ఇంటికో రుద్రమ్మ వంటి పలు చిత్రాలను ఈయన డైరెక్ట్ చేశారు. తెలుగులో డైరెక్టర్ అయి ఉండి కూడా ఆయన తన కొడుకు విజయం తెలుగులో లాంచ్ చేయలేదు. అయినప్పటికీ విజయ్ కోలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరో స్టేటస్ ని ఎంజాయ్ చేయడంతో పాటు టాలీవుడ్ లో కూడా బాగా ఫేమస్ అయ్యారు.
ALSO READ : “అల్లు అర్జున్ – త్రివిక్రమ్” సినిమా కథ ఇదేనా..? ఈసారి ఇలా ఆలోచించారా..?
End of Article