“హాలీవుడ్ సినిమా” తో పాటు… అనౌన్స్ చేశాక ఆగిపోయిన 7 “చిరంజీవి” సినిమాలు..!

“హాలీవుడ్ సినిమా” తో పాటు… అనౌన్స్ చేశాక ఆగిపోయిన 7 “చిరంజీవి” సినిమాలు..!

by Sunku Sravan

Ads

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే మిడిల్ డ్రాప్ లు అనేవి తప్పనిసరిగా అంటుంటారు సినీ ప్రముఖులు. ఇదేదో కామెడీగా చెబుతున్నారు అనుకోవద్దు. ఇది మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే..అది కూడా మధ్యలో ఆగిపోయిన సినిమాల గురించి మనం తెలుసు కుందాం..!

Video Advertisement

మెగాస్టార్ చిరంజీవి అంటే సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించిన గౌరవప్రదమైన స్థానంలో ఉన్న హీరో. ఆయనకు దేశవ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆయన సినీ కెరీర్ లో కూడా చాలా సినిమాలు మిడిల్ డ్రాప్ లోనే ఆగిపోయాయి. చిరంజీవి సినీ లైఫ్ లో 150 పైగా సినిమాలు తీశారు. అందులో చాలా సినిమాలు అనేక అవాంతరాలు దాటుకుని రిలీజ్ అయిపోయాయి.

కానీ కొన్ని సినిమాలు మాత్రం అడ్డంకులు దాటలేక, ఇంకొన్ని సినిమాలు అసలు ప్రారంభానికి నోచుకోక, మరి కొన్ని సినిమాలు ఏమో ప్రారంభమైన చోట కూడా ఆగిపోయాయి.

#1 భూలోక వీరుడు

చిరంజీవి ఓకే చేసి ఆగిపోయిన సినిమాల జాబితా చూసుకుంటే చాలా పెద్దగా ఉంటుంది. అలాంటి వాటిలో అశ్వినిదత్ నిర్మించాలనుకున్న భూలోక వీరుడు ఒకటి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో జానపదం గా ఈ సినిమా తిద్దామనుకున్నాను. కానీ ఎంచుకున్న కథలో కొన్ని మిస్టేక్ గమనించి సినిమాను మధ్యలోనే ఆపివేశారు.

remake movies of megastar chiranjeevi..!!

 

#2 వినాలని ఉంది

అలాగే రామ్ గోపాల్ వర్మ సినిమా అనౌన్స్ చేశారు చిరంజీవితో కొంత భాగం షూటింగ్ కూడా అయింది. ఊర్మిళ, టబులతో రెండు పాటలు కూడా పూర్తి చేశారు. అలాగే భారీ ట్రాఫిక్ జామ్ కాన్సెప్ట్ లో కొన్ని సీన్లను తెరకెక్కించారు. కానీ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది.

list of movies that stopped in the middle of shooting..!!

#3 అబు బాగ్దాద్ గజదొంగ

ప్రస్తుతం పాన్ ఇండియా పాన్ వరల్డ్ అంటున్నారు కానీ, చిరంజీవి ఎప్పుడో మొదలు పెట్టేసారు ఆ తరహా సినిమా అది అబు బాగ్దాద్ గజదొంగ సురేష్ కృష్ణ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటుగా ప్రత్యేక హాలీవుడ్ చిత్రంగా తెరకెక్కించారు. కానీ అది కూడా కొన్ని రోజులకు మధ్యలోనే ఆగిపోయింది.

list of movies that stopped in the middle of shooting..!!

#4 వజ్రాల దొంగ

అలాగే చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో వజ్రాల దొంగ రామ్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా మొదలైంది ఆ తర్వాత ఆగిపోయింది.

#5 ఎస్ వి కృష్ణారెడ్డి సినిమా

ఎస్ వి కృష్ణారెడ్డి చిరంజీవితో సినిమా చేద్దామనుకున్నారు. పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. కానీ సినిమా పట్టాలెక్కలేదు.

#6 ఆదిత్య సినిమా

ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు, కుటుంబ కథలు తీసి మంచి విజయాలు అందుకున్న దర్శకుడు ఆదిత్య ఈ క్రమంలో ఆయన చిరంజీవితో సినిమా చేద్దాం అనుకుని అంతా ఓకే అయిన తర్వాత ఆ సినిమా ముందుకు వెళ్లలేదు.

remake hit movies of chiranjeevi

#7 ఆటో జానీ

రాజకీయాల నుంచి బయటకు వచ్చాక చిరంజీవి మరో సినిమా ఆటో జానీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తుందని అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ సినిమాపై చాలా రోజులు చర్చ కూడా జరిగింది. కానీ సినిమా వర్కవుట్ అవ్వలేదు. ఆ విధంగా చాలా సినిమాలు చిరంజీవి కెరీర్ లో ఆగిపోయాయి.


End of Article

You may also like