అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మెగాస్టార్ టాప్ 10 చిత్రాలు ఇవే..! ఏ సినిమా ఎంత అంటే.?

అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మెగాస్టార్ టాప్ 10 చిత్రాలు ఇవే..! ఏ సినిమా ఎంత అంటే.?

by Mohana Priya

Ads

తెలుగు సినిమా స్థాయిని పెంచిన వాళ్ళలో చిరంజీవి ఒకరు. ఒక సాధారణమైన కుటుంబం నుండి వచ్చి సహాయ పాత్రలతో తన కెరీర్ ని మొదలు పెట్టి, తర్వాత హీరోగా ఎన్నో సినిమాలను చేశారు. చిరంజీవి నుండి సుప్రీం హీరో చిరంజీవి వరకు మళ్లీ అక్కడి నుండి మెగాస్టార్ చిరంజీవి వరకు ఎదిగే క్రమంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. వరుసగా ఫ్లాపులు వచ్చినా కూడా తట్టుకొని తిరిగి మళ్లీ తనేంటో నిరూపించుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి.

Video Advertisement

బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే ఏ నటుడికి అయినా తనకి స్ఫూర్తినిచ్చింది ఎవరు అంటే చాలామంది చెప్పే పేరు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మైలురాయిగా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కొన్ని ప్రత్యేకమైన సినిమాలు ఇవే.

#1 సైరా నరసింహారెడ్డి

ఇన్నేళ్ల సిని ప్రస్థానంలో మొదటి సారిగా పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన సినిమా సైరా నరసింహారెడ్డి. తెలంగాణా యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను ప్రపంచవ్యాప్తంగా తెలిపిన ఈ సినిమా, 140 కోట్ల షేర్ రాబట్టింది. మెగాస్టార్ కెరియర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే.

#2 ఖైదీ నెంబర్ 150

ఎన్నో సంవత్సరాల గ్యాప్ తర్వాత చిరంజీవి మళ్లీ నటించిన సినిమా ఖైదీ నెంబర్ 150. ఈ సినిమా 104 కోట్ల వసూళ్లతో లాభాలు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

#3 శంకర్ దాదా ఎంబిబిఎస్

మామూలుగా క్లాసిక్ సినిమాలను ముట్టుకోకూడదు అంటారు. హిందీలో అప్పటికే ఎంతో గొప్ప స్థాయిలో అభినందనలు అందుకున్న మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాను తెలుగులో శంకర్ దాదా ఎంబిబిఎస్ గా రీమేక్ చేశారు. మొదట అసలు ఆ సినిమా స్థాయిని మన తెలుగు రీమేక్ సినిమా అందుకోగలుగుతుందా అనే అనుమానాల మధ్య విడుదల అయ్యింది శంకర్ దాదా ఎంబిబిఎస్.

కానీ సినిమా ఊహించని స్థాయిలో హిట్ అయింది. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే అందులో మెగాస్టార్ పర్ఫామెన్స్ ఇంకొక ఎత్తు. మాతృకలో నటించిన సంజయ్ దత్ ను మరిపించేలా చేశారు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ రీమేక్ సినిమా జాబితాలో ఇప్పటికీ ఈ సినిమా పేరు ఉంటుంది. థియరిటికల్ బిజినెస్ అయిన డబ్బులకు 12 కోట్ల లాభంతో 26 కోట్లు కలెక్షన్లు రాబట్టింది.

#4 ఠాగూర్

బహుశా తెలుగు సినిమాల్లో సోషల్ మెసేజ్ తో సినిమాలు రావడం మొదలైంది ఈ సినిమా తర్వాతే అయ్యుండొచ్చు. తమిళ్ లో వచ్చిన రమణ సినిమా రీమేక్ అయినా కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి తీశారు. ఈ సినిమా 24 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

#5 స్టాలిన్

మురుగదాస్ దర్శకత్వం వహించిన తొలి తెలుగు సినిమా. ఫలితం మాట ఎలా ఉన్నా 23 కోట్లు వసూళ్లను రాబట్టింది.

#6 శంకర్ దాదా జిందాబాద్

శంకర్ దాదా ఎంబిబిఎస్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో జనాలను ఆకట్టుకోలేకపోయింది. మొదటి సినిమాకి ఈ సినిమాకి డైరెక్టర్ లు వేరు అవడంతో కథను హ్యాండిల్ చేసే విధానం కూడా మారింది. దాంతో 18 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.

#7 ఇంద్ర

ఈ సినిమా డైలాగులు పాటలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీణ స్టెప్ ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. మెగాస్టార్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటి. ఇంద్ర 27 కోట్ల షేర్ వసూలు చేసింది.

#8 అన్నయ్య

ఈ చిత్రం మూడు కోట్ల లాభాలతో మొత్తంగా 13 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

#9 అంజి

భారీ అంచనాలతో వచ్చిన ఈ సోషియో ఫాంటసీ చిత్రం ఆ అంచనాలను అందుకోలేక పోయింది. 24 కోట్ల థియరిటికల్ బిజినెస్ జరిగితే 12 కోట్లు వసూలు చేసింది.

#10 జై చిరంజీవ

సినిమా కథ ఎలా ఉన్నా. కామెడీ బాగుండడంతో 12 కోట్లు వసూళ్లను రాబట్టింది.

ఇవే కాకుండా చిరంజీవి కెరియర్లో ఖైదీ, చంటబ్బాయి, బావగారు బాగున్నారా, యముడికి మొగుడు, అభిలాష, విజేత , స్వయంకృషి,జగదేక వీరుడు అతిలోక సుందరి, ముఠా మేస్త్రి, రాక్షసుడు, ఆపద్బాంధవుడు, ఘరానా మొగుడు, ఆరాధన, రుద్రవీణ, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్, చూడాలని ఉంది లాంటి ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలు ఉన్నాయి.


End of Article

You may also like