మా అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ మెగా సపోర్ట్ అతనికే

మా అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ మెగా సపోర్ట్ అతనికే

by Anudeep

Ads

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మేగా స్టార్ చిరంజీవి ని కలిశారు. ఈ మీటింగ్ ఇప్పుడు ఇండస్ట్రీ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. తన షోల్డర్ కు సర్జరీ జరగడం తో హాస్పిటల్లో ఉన్న ప్రకాష్ రాజ్ నిన్ననే డిశ్చార్జ్ అయ్యో ఇలా ఈరోజు చిరంజీవిని కలవడం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. అసలు ఈ ఇద్దరి మీటింగ్ వెనుక ఎజెండా ఏమయ్యి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కోరుక్కుంటున్నాయి.

Video Advertisement

ఈరోజు ఉదయాన్నే జిమ్ లో బాస్ ని కలవడం జరిగింది. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపిన అన్నయ్య కు కృతజ్ఞతలు. ఇలాంటి ఒక అన్నయ్య ఉండటం మన చేసుకున్న అదృష్టం అంటూ తన అఫీషియల్ ట్విట్టర్ హేండిల్ లో ప్రకాష్ రాజ్ షేర్ చేసాడు.

అయితే ప్రకాష్ రాజ్ MAA అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండటం, అతనికి మెగా బ్రదర్ నాగబాబు ఫుల్ సపోర్ట్ ని చేయడం తో ఇప్పుడు ఇలా వీరిద్దరూ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదేదో అనుకోకుండా జరిగిన మీట్ మాత్రం కాదన్నది నిజం.


End of Article

You may also like