Ponniyin Selvan-2 Review : “మణిరత్నం” దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ – 2 హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Ponniyin Selvan-2 Review : “మణిరత్నం” దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ – 2 హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

గత సంవత్సరం కొన్ని నెలల క్రితం ఈ సినిమా మొదటి పార్ట్ విడుదల అయ్యింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రెండవ పార్ట్ కూడా విడుదల అయ్యింది. మొదటి భాగంలో చూపించిన ఎన్నో ప్రశ్నలకు ఈ సినిమాలో సమాధానాలు చెప్తారు. మరి ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : పొన్నియిన్ సెల్వన్ – 2
  • నటీనటులు : విక్రమ్, ఐశ్వర్యా రాయ్, కార్తీ, జయం రవి, త్రిష కృష్ణన్.
  • నిర్మాత : మణిరత్నం, సుభాస్కరన్
  • దర్శకత్వం : మణిరత్నం
  • సంగీతం : ఏఆర్ రెహమాన్
  • విడుదల తేదీ : ఏప్రిల్ 28, 2023

ps 2 movie review

స్టోరీ :

సినిమా ఆదిత్య కరికాళుడు (విక్రమ్), నందిని (ఐశ్వర్యా రాయ్) ప్రేమ కథతో మొదలవుతుంది. వారిద్దరూ చిన్నప్పటినుంచి ఎలా కలిసి పెరిగారు అనే విషయాన్ని చూపిస్తారు. మొదటి భాగంలో చనిపోయాడు అనుకునే రాజరాజ చోళుడు (జయం రవి) బతికే ఉంటాడు అని తెలుస్తుంది. అతనిని కాపాడింది ఒక ముసలావిడ అని చెప్తాడు.

ps 2 movie review

తర్వాత ఆ ముసలావిడ మందాకిని (ఐశ్వర్యా రాయ్) అని తెలుస్తుంది. మందాకినికి మాటలు రావు. మందాకినికి, చోళ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆదిత్య, నందిని ఎందుకు విడిపోయారు? రాజ్యం ఎవరికి దక్కింది? తన తమ్ముడిని చంపింది అని పగ తీర్చుకోవడానికి నందిని కోసం వచ్చిన ఆదిత్య తర్వాత ఏం చేశాడు? చోళులు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? నందిని రహస్యం ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

కొన్ని నెలల క్రితం ఈ సినిమా మొదటి భాగం విడుదల అయ్యింది. కొంత మంది ఆ సినిమా చూసి బాగుంది అంటే, మరి కొంత మంది మాత్రం, “బాహుబలితో పోలిస్తే అసలు ఈ సినిమా అంత గొప్పగా ఏమీ లేదు” అని అన్నారు. ఇదంతా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో తమిళ్ ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులకు మధ్య మా సినిమా గొప్ప అంటూ గొడవలు కూడా జరిగాయి. దాదాపు 70 సంవత్సరాలు క్రితం కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు.

ps 2 movie review

చోళ సామ్రాజ్యంలో జరిగే విషయాలు అన్నీ ఈ నవలలో చూపించారు. ఇదే నవలని తెరపై సినిమా రూపంలో తీసుకురావడానికి మణిరత్నం ప్రయత్నించారు. ఆ ప్రయత్నం చాలా వరకు సక్సెస్ అయ్యింది. మణిరత్నం ఇలాంటి జోనర్ ఉన్న సినిమాలు చేయడం ఇదే మొదటి సారి. మొదటి భాగంలో లాగానే ఈ భాగంలో కూడా ఎమోషన్స్ చాలా ఉంటాయి. కానీ మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో స్టోరీ ఇంకా బాగుంది.

ps 2 movie review

అసలు ఈ సినిమా చూస్తే మొదటి భాగం కేవలం ఇంట్రడక్షన్ ఏమో అనిపిస్తుంది. అలాగే యాక్షన్ సీన్స్ కూడా ఇందులో ఉన్నవి బాగున్నాయి. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సినిమాకి పెద్ద హైలైట్ అయ్యింది మాత్రం విక్రమ్. మొదటి భాగంలో ఏదో ఒక కోపంగా ఉన్న, బాధతో ఉన్న ఒక వ్యక్తి లాగా కనిపిస్తారు. కానీ ఇందులో మాత్రం అన్ని రకమైన ఎమోషన్స్ విక్రమ్ తెరపై చూపించారు. అలాగే విక్రమ్ పాత్ర తర్వాత ప్రేక్షకులని అంతగా కట్టుకున్న మరొక పాత్ర కార్తీ పాత్ర.

ps 2 movie review

కార్తీ పాత్ర మొదటి భాగంలో కూడా పెద్ద హైలైట్ అయ్యారు. ఈ సినిమాలో కూడా అదే స్టైల్ లో నటించారు. విక్రమ్ తో సమానంగా ప్రాముఖ్యత ఉండి, సినిమాకి మరొక ప్లస్ పాయింట్ అయిన పాత్ర ఐశ్వర్యా రాయ్. ఐశ్వర్యా రాయ్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో నటించారు. మొదటి భాగంలో ఆ రెండవ పాత్ర కి సంబంధించి ఒక చిన్న క్లూ ఇచ్చారు. ఈ సినిమాలో ఆ పాత్ర కనిపిస్తారు. మిగిలిన వాళ్లు అంతా కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. కానీ సినిమా మొత్తం వీరి మీద నడుస్తుంది.

ps 2 movie review

కాబట్టి మిగిలిన పాత్రలకి అంత పెద్ద స్కోప్ కూడా లేదు ఏమో అనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం చాలా బాగుంది. సినిమా కోసం వేసిన సెట్టింగ్స్, లొకేషన్స్, అవన్నీ కూడా మొదటి భాగంలో ఉన్నట్టుగానే ఉన్నాయి. టెక్నికల్ గా ఈ సినిమా చాలా బాగుంది. కానీ సినిమా నిడివి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అయితే అంత పెద్ద నవలని తెరపై చూపించాలి అంటే రెండు భాగాలు కూడా సరిపోవు అని అనడం కరెక్టే ఏమో అనిపిస్తుంది.

ps 2 movie review

ఫస్ట్ హాఫ్ మామూలుగా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎక్కువ సమయం ఉంటుంది. అందులోనూ కొన్ని సీన్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి. అందులోనూ ఆ సీన్స్ అన్నీ కూడా ఎమోషనల్ గా ఉంటాయి. అసలు చాలా సీన్స్ మణిరత్నం తప్ప మరి వేరే దర్శకులు తీయలేరు ఏమో అనిపిస్తుంది. కానీ మొదటి భాగం చూసి చాలా బోర్ గా ఉంది అని అనుకునేవాళ్లు, ఈ సినిమా చూసి అంత ఎంటర్టైనింగ్ గా ఫీల్ అయ్యే అవకాశం తక్కువే. ఏ దర్శకుడు స్టైల్ ఆ దర్శకుడిదే, ఎవరి టేకింగ్ వాళ్లదే, ఒకరితో ఒకరికి పోలిక లేదు అని అనుకునేవారు మాత్రం ఈ సినిమా బోర్ ఫీల్ అవ్వకుండా చూస్తారు.

ps 2 movie review

ఎందుకంటే కొన్ని ఎమోషన్స్ తెరపై చూపించాలి అంటే వాటికి తగిన సమయం ఇవ్వాలి అనే ఒక ఫార్ములా అని సినిమాలో ఫాలో అయ్యారు. సినిమా మొత్తం ఒక యాక్షన్ డ్రామాగా కాకుండా అసలు నిజంగా చోళుల సామ్రాజ్యంలో జరిగే విషయాల గురించి, వారి రహస్యాల గురించి, అసలు ఆ పాత్రల వెనుక ఉన్న కథ గురించి ఈ సినిమాలో చూపించారు. దాంతో ఆ కథని తెరపై చూపించడానికి ఎంత సమయం ఇవ్వాలో అంత సమయం ఇచ్చారు. సినిమాలో యాక్షన్ కంటే ఎక్కువ ఆ పాత్రల మధ్య ఉన్న ఎమోషన్ కి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అందుకే చాలా సీన్స్ నిడివి చాలా ఎక్కువగా అనిపిస్తుంది.

ps 2 movie review

ఇంటర్వెల్ తర్వాత వచ్చే కొన్ని సీన్స్ మాత్రం తెరపై చాలా బాగా కనిపించాయి. అందులోనూ ముఖ్యంగా మనకి ట్రైలర్ లో చూపించే విక్రమ్, ఐశ్వర్యా రాయ్ మధ్య వచ్చేసి సీన్ లో వాళ్ళ నటన మరొక పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. చివరిలో వచ్చే ట్విస్ట్ సినిమా కథ తెలియని ప్రేక్షకులు ఊహించే అవకాశం లేదు. ఒకవేళ సినిమాలో చూపించే ఎమోషన్స్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేకపోతే మాత్రం చాలా సీన్స్ చూసే ప్రేక్షకులకి సాగదీసినట్టుగా అనిపించే అవకాశం ఉంది.

ప్లస్ పాయింట్స్ :

  • నిర్మాణ విలువలు
  • పాటలు
  • నటీనటుల పర్ఫార్మెన్స్
  • కొన్ని ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • సినిమా నిడివి
  • యాక్షన్ సీన్స్ తక్కువగా ఉండడం

రేటింగ్ :

2.75/5

ట్యాగ్ లైన్ :

బాహుబలి సినిమాతో పోల్చకుండా ఈ సినిమాని మరొక సినిమాలాగా చూసే వాళ్ళకి, సినిమాలో యాక్షన్ ఎక్కువగా ఉండాలి అని అనుకోకుండా కేవలం టేకింగ్ పరంగా, నటీనటుల పెర్ఫార్మెన్స్ కోసం మాత్రమే సినిమాని చూసే వాళ్ళకి సినిమా చూసేవారికి ఈ సినిమా నిరాశపరిచే అవకాశం లేదు. ఏ డైరెక్టర్ టేకింగ్ ఆ డైరెక్టర్ దే, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అని అనుకుంటే మాత్రమే ఈ సినిమా చూడగలుగుతారు. కానీ ఫైటింగ్స్ అవన్నీ ఉంటాయి అని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం కొన్ని పొన్నియిన్ సెల్వన్ సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.

watch trailer :


You may also like