ఢీ షో డ్యాన్స్ మాస్టార్ చైతన్య మరణవార్త బుల్లితెరను కలవరానికి గురి చేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యంగ్ కొరియోగ్రాఫర్ చైతన్య బలవన్మరణానికి పాల్పడడం ఢీ షో జడ్జీలు, కంటెస్టెంట్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
Video Advertisement
చైతన్య ఎందుకు ఇలా చేశావని అతడి సన్నిహితులు బాధపడుతున్నారు. అసలు చైతన్యకు అప్పులు ఉన్నట్టు కూడా తమకు తెలియదని చెప్తున్నారు. చైతన్య మృతికి శేఖర్ మాస్టర్, యాంకర్ రష్మి, శ్రద్ధాదాస్ తో పాటు ఢీ డ్యాన్సర్లు కూడా తమ సంతాపం తెలుపుతున్నారు.
ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య నెల్లూరులోని ఒక హోటల్ గదిలో ఆదివారం నాడు ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పుల బాధలు తట్టుకోలేక ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా చైతన్య సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. అప్పుల తీర్చే శక్తి ఉన్నప్పటికి, ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని ఆ వీడియోలో తెలిపాడు. చైతన్య మరణ వార్త షాక్ కు గురి చేసిందని, అతనికి అప్పులు ఉన్నట్టు తమకు తెలియదని సన్నిహితులు అంటున్నారు.
డ్యాన్స్ మాస్టార్ చైతన్య మృతికి యాంకర్ రష్మి, శేఖర్ మాస్టర్, శ్రద్ధాదాస్ లతో పాటు ఢీ షో డ్యాన్సర్లు కూడా సంతాపం తెలుపుతున్నారు. అయితే చైతన్య మరణం గురించి తెలిసి ఢీ కంటెస్టెంట్లు, చైతన్య సన్నిహితులు అప్పుల వల్ల బలవన్మరణానికి పాల్పడ్డాడు అంటే నమ్మలేకపోతున్నాం. చైతన్యకు అప్పులు ఉన్నాయనే సంగతే తమకు ఇప్పటి వరకు తెలియదని, చైతన్య వాటి గురించి తమతో మాట్లాడి ఉంటే అందరం చర్చించుకుని ఈ సమస్యకు మార్గాన్ని ఆలోచించేవాళ్లం, అలాగే చైతన్యకు మద్దతుగా ఉండేవారమని తెలిపారు.
అయితే చైతన్య ఎప్పుడూ తన సమస్యను మాతో షేర్ చేసుకోలేదని, తనలోనే బాధపడి, ఆఖరికి ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడని విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చైతన్య తన సమస్యను, బాధను సన్నిహితులతో పంచుకుని ఉంటే ఇలా అయ్యేది కాదేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తమ బాధని ఎవరితో పంచుకోకుండా తమలో తామే కుంగిపోతూ చివరికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుని తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఇక డాన్స్ మాస్టర్ చైతన్య కూడా అటువంటి తప్పే చేశాడు. తన సమస్య గురించి కానీ, పరిస్థితి గురించి ఎవ్వరితో పంచుకోలేదు. తనలో తానే బాధపడుతూ ఆఖరికి ప్రాణం తీసుకున్నాడు. ఎంతో ఎత్తుకు ఎదుగుతాడనుకున్న కొడుకు తమ కళ్ళ ముందే మరణించడంతో చైతన్య తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు.