Ads
Human angle

ముఖ్యమంత్రికి అయినా సరే భయపడని కలెక్టర్….ఆ ఒక్క సంఘటనతో రాష్ట్రమంతా ఆమె పేరు మారు మోగిపోయింది.!

Published by
Mohana Priya

సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అలా ఎన్నో కష్టాలు పడి, ఎంతో బాగా చదివి, మొదటి అటెంప్ట్ లోనే ఆల్ ఇండియా నాల్గవ ర్యాంక్ తో సివిల్స్ లో విజయం పొందారు టీ.వీ. అనుపమ. అనుపమ కేరళకి చెందిన వారు. డ్యూటి విషయానికొస్తే అనుపమ రాజకీయ రంగానికి చెందిన  ఎంత పెద్ద వ్యక్తులకైనా, ముఖ్యమంత్రికి అయినా సరే భయపడరు. ధైర్యంగా న్యాయం వైపు నిలబడతారు. ఇందుకు 2017 లో జరిగిన ఈ సంఘటనే ఒక ఉదాహరణ.

అది  కేరళలోని ఆలప్పుళ జిల్లా. ఆ జిల్లాలోని మార్తాండం చెరువును పరిశీలిస్తున్నారు ఆ జిల్లా కలెక్టర్ అయిన అనుపమ. అక్కడ ఒక కట్టడం కోసం చెరువు సగం లెవెల్ చేసి ఉంది. ఆ చెరువుని ఆనుకొని ఇంకొక వైపు వరి పొలాలు ఉన్నాయి. అక్కడ ఉన్న సబార్డినేట్స్ ని అనుపమ ఇక్కడ ఏం కడుతున్నారు అని అడిగారు. అందుకు సబార్డినేట్ పార్కింగ్ లాట్ అని చెప్పారు. అనుపమ కార్లో కూర్చొని అక్కడి నుంచి కదిలినప్పుడు ఆ సంబంధిత సబార్డినేట్ ఒక విషయం చెప్పారు.

ఆ సబార్డినేట్ “మేడమ్, ఇందులో మంత్రి గారి హస్తం ఉంది. ప్రతిపక్షాల నుంచి చాలా కంప్లైంట్ వచ్చినా సరే మేనేజ్ చేశారు. అంతే కాకుండా ఈ విషయాన్ని నిరూపిస్తే మినిస్టర్ పదవికి మాత్రమే కాదు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాను” అని అన్నారని చెప్పారు. ఈ విషయాన్ని విన్న అనుపమ ఈ కట్టడం లేనప్పటి సమయంలో చెరువుకు సంబంధించిన ఫోటోలు ఇవ్వమని అడిగారు.

ఆ సబార్డినేట్ ప్రయత్నిస్తాను అని చెప్పారు. ఆ తర్వాత ఆ చెరువుకి చెందిన శాటిలైట్ ఫోటోలు వచ్చాయి. ఆ పాత ఫోటోలని ఇప్పటి ఫోటోలుని పోల్చి చూస్తే అంతకుముందు చెరువు ఎలా ఉందో స్పష్టం గా కనబడుతోంది. ఈ విషయాలన్నిటినీ పెట్టి పూర్తి వివరాలతో ఒక నివేదిక తయారు చేసి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి సమర్పించారు అనుపమ.

దీని మీద ఆ సంబంధిత వ్యక్తి కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఆయన పిటిషన్ ని కొట్టిపారేసింది. కేరళ ప్రభుత్వం ప్యాడీ అండ్ వెట్ ల్యాండ్ యాక్ట్ కింద ఈ నేరం రుజువైంది. ఆ మంత్రి కేరళ రవాణా శాఖ మంత్రి థామస్ చాండి. ఈ సంఘటన తర్వాత అనుపమ పేరు కేరళ అంతా మారు మోగిపోయింది.


Published by
Mohana Priya

Recent Posts

  • Off Beat

1p/sec తో టెలికాం రంగంలో రెవల్యూషన్ తీసుకొచ్చిన “టాటా డొకోమో”…ఎందుకు సడన్ గా క్లోజ్ అయ్యింది.?

కొన్ని సంవత్సరాల క్రితం ఒక ట్రెండ్ సృష్టించిన టెలికాం కంపెనీ టాటా డొకోమో. దీన్ని భారతదేశంలో ఎక్కువ శాతం మంది… Read More

52 mins ago
  • Bigg Boss 5 telugu

Bigg Boss Telugu-5 : షన్నుకి సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్.!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇవాల్టి ఎపిసోడ్ ప్రోమో విడుదల అయ్యింది. ఇవాళ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ తన… Read More

1 hour ago
  • Filmy Adda

“జెర్సీ” సినిమాలో ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారో..? ఎప్పుడైనా గమనించారా?

డైరెక్టర్ పని అంత సులభమైనది కాదు. ఒక సినిమా మాత్రమే కాదు ఆ సినిమా లో నటించిన వాళ్ళు, ఇంకా… Read More

4 hours ago
  • Filmy Adda

మీడియా కి నాగ చైతన్య వార్నింగ్ ఇలా వింటేనే మీతో ఇంటర్వ్యూ లు అంటూ షరతు ..!

అక్కినేని వారసుడు నాగ చైతన్య, సమంతల పైన వ్యక్తిగత జీవితం పైన గతి కొన్ని రోజులుగా మీడియా లో వస్తున్న… Read More

4 hours ago
  • Bigg Boss 5 telugu

బిగ్‌బాస్ ప్రియ కూతురి కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు..! చనిపోయే రెండు రోజుల ముందే..?

ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరు శైలజ… Read More

4 hours ago
  • Filmy Adda

దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘హనుమాన్’ ఫస్ట్ లుక్ వచ్చేది ఎప్పుడంటే !

వెరైటీ కాన్సెప్ట్స్ తో టాలీవుడ్ లో తనదైన ముద్ర ని వేసుకున్న దర్శకుడు 'ప్రశాంత్ వర్మ'. ఆ, కల్కి, జాంబీ… Read More

5 hours ago
Ads