Ads
కలర్స్ స్వాతి చాలా కాలం తర్వాత సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తూ నటించిన మూవీ ‘మంత్ ఆఫ్ మధు’. ఈ మూవీలో హీరోగా నవీన్ చంద్ర నటించారు. ఈ మూవీ తాజాగా థియేటర్ల లో విడుదల అయ్యింది. ఈ సినిమాకు శ్రీకాంత్ నగోతి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రేయ నవిలే, జ్ఞానేశ్వరి, మంజుల, వైవా హర్ష వంటివారు కీలక పాత్రల్లో నటించారు. రిలీజ్ కు ముందు చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ తో మంచి బజ్ ను తెచ్చుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పడు చూద్దాం.. కలర్స్ స్వాతి యాంకర్, హీరోయిన్, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో స్వాతి వికాస్ అనే వ్యక్తిని ఆగస్టు పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీకి దూరం అయ్యింది. చాలా గ్యాప్ తరువాత మంత్ ఆఫ్ మధు మూవీ ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, వైజాగ్ లో నివసించే మధుసూధన్ రావు(నవీన్ చంద్ర) తన గవర్నమెంట్ జాబ్ ను పోగొట్టుకుంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లేఖ (స్వాతి రెడ్డి) విడాకుల కోసం కోర్టుకు వెళ్తుంది. అయితే మధుసూధన్ తన భార్య ఎప్పటికైనా తిరిగి వస్తుందనే నమ్మకంతో వెయిట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను మద్యానికి బానిస అవుతాడు. ఇది ఇలా ఉంటే, యూఎస్ లో సెటిల్ అయిన మధుమతి(శ్రియ నవిలే) అనే అమ్మాయి బంధువుల ఇంట్లో వివాహానికి వైజాగ్ వస్తుంది. అయితే ఒక సందర్భంలో మధుమతికి మధుసూధన్ తో పరిచయం అవుతుంది. ఒకసారి మాటల సందర్భంలో మధుసూధన్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఆమెకు తెలుస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? లేఖ ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంది? ఆఖరికి లేఖ మధుసూదన్ కలిశారా? అనేది మిగిలిన కథ. మంత్ ఆఫ్ మధు సినిమా అనేది అమెరికా నుంచి వైజాగ్ కి వచ్చిన మధుమతి నెల రోజుల్లో ఎదుర్కొన్న అనుభవాలే ఈ మూవీ. Also Read: MAAMA MASCHEENDRA REVIEW : “సుధీర్ బాబు” ట్రిపుల్ యాక్షన్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Video Advertisement
End of Article