MAAMA MASCHEENDRA REVIEW : “సుధీర్ బాబు” ట్రిపుల్ యాక్షన్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

MAAMA MASCHEENDRA REVIEW : “సుధీర్ బాబు” ట్రిపుల్ యాక్షన్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

ఎస్ఎంఎస్ (శివ మనసులో శృతి) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నటుడు సుధీర్ బాబు. అప్పటి నుండి వరుసగా సినిమాలు చేస్తున్నారు. సుధీర్ బాబు ట్రిపుల్ యాక్షన్ చేసిన సినిమా మామా మశ్చీంద్ర. ఈ సినిమాకి అమృతం సీరియల్ అమృత రావు అలియాస్ హర్షవర్ధన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : మామా మశ్చీంద్ర
  • నటీనటులు : సుధీర్ బాబు, ఈషా రెబ్బ, మృణాళిని రవి, హర్షవర్ధన్.
  • నిర్మాత : సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు
  • దర్శకత్వం : హర్షవర్ధన్
  • సంగీతం : చైతన్ భరద్వాజ్
  • విడుదల తేదీ : అక్టోబర్ 6, 2023

mama mascheendra movie review

స్టోరీ :

కొన్ని కారణాల వల్ల పరశురామ్ (సుధీర్ బాబు) బంధాలకి దూరంగా ఉంటాడు. తన చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలు తనని ఇలా మార్చేస్తాయి. డబ్బు కోసం సొంత వాళ్ళని కూడా చంపాలి అనుకుంటాడు. తన చెల్లెలిని, చెల్లెలి భర్తని, అలాగే వారి పిల్లల్ని చంపేయమని తన మనిషి అయిన దాసు (హర్షవర్ధన్) కి చెప్తాడు. కానీ వాళ్ళు తప్పించుకుంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత పరశురామ్ కూతురు విశాలాక్షి (ఈషా రెబ్బ) దుర్గ (ఇంకొక సుధీర్ బాబు) అనే ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది.

mama mascheendra movie review

దుర్గ విశాఖలో ఉండే ఒక రౌడీ. దాసు కూతురు అయిన మీనాక్షి (మృణాళిని రవి) హైదరాబాద్ కి ఉద్యోగం కోసం వచ్చి అక్కడే ఉంటున్న ఒక డీజే (సుధీర్ బాబు) తో ప్రేమలో పడుతుంది. ఈ ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు వ్యక్తులని ప్రేమించారు అని తెలుసుకున్న పరశురామ్ వాళ్ళు ఎవరు అని చూడగా, వాళ్లు అచ్చం తన పోలికలతోనే ఉన్న తన మేనల్లుళ్లు అని తెలుస్తుంది.

mama mascheendra movie review

దాంతో పరశురామ్ కి వాళ్లు నిజంగానే ఆ అమ్మాయిలని ప్రేమించారా? లేదా తన మీద పగ తీర్చుకోవడానికి ఈ కారణంతో వాళ్లకి దగ్గర అవ్వాలి అని ప్రయత్నించారా? అనే అనుమానం వస్తుంది. ఇందులో ఉన్న నిజం ఎంత? అసలు పరశురామ్ చెల్లెలు, చెల్లెలి భర్త ఏమయ్యారు? పరశురామ్ ఇలా మారడానికి కారణం ఏంటి? తర్వాత వీరందరూ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

mama mascheendra movie review

రివ్యూ :

సాధారణంగా ఒక హీరో రెండు పాత్రలు పోషిస్తున్నాడు అంటేనే, ఆ రెండు పాత్రలకు మధ్య ఉన్న వేరియేషన్స్ ఎలా చూపిస్తాడు అని ఒక ఆసక్తి నెలకొంటుంది. అలాంటిది ఒక హీరో మూడు పాత్రలు పోషిస్తున్నాడు అంటే ఆసక్తి ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. సినిమా కథ ఎలా ఉంటుంది? అసలు సుధీర్ బాబు మూడు పాత్రలు ఎలా కనెక్ట్ అవుతాయి? ఇలాంటి డిస్కషన్స్ ఎక్కువగా నడిచాయి.

mama mascheendra movie review

దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఒక రాతి గుండె ఉన్న వ్యక్తి అసలు తన కుటుంబానికి ఎందుకు దూరం అయ్యాడు? తర్వాత వీళ్లంతా ఎలా కలిశారు? ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ టేకింగ్ విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో. ఈ ఒక్క విషయం కాస్త రొటీన్ గా అనిపిస్తుంది. అంత సాలిడ్ పాయింట్ తీసుకున్నప్పుడు అంతే సాలిడ్ గా సినిమా కూడా ఉంటే బాగుంటుంది.

mama mascheendra movie review

సినిమా ముందుకు వెళుతున్న కొద్ది తెలిసిపోతూ ఉంటుంది. అంతే కాకుండా సినిమా ఎండింగ్ కూడా చాలా రొటీన్ గా ఉంది. సినిమా చివరి వరకు కూడా ఏదైనా ఒక ట్విస్ట్ ఉంటుంది ఏమో అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ విషయం కాస్త డిసప్పాయింట్ చేస్తుంది. సుధీర్ బాబు మూడు పాత్రల్లో వేరియేషన్ బాగుంది. కాకపోతే దుర్గ పాత్రకి వాడిన ప్రాస్థిటిక్స్ అక్కడక్కడ తెలిసిపోతూ ఉంటాయి.

mama mascheendra movie review

అంతే కాకుండా ముసలి సుధీర్ బాబు పాత్ర పెద్దాయనలాగా అనిపించదు. ఒక యంగ్ వ్యక్తికి ఒక తెల్ల జుట్టు ఉన్న విగ్ పెట్టినట్టు అనిపిస్తుంది అంతే. కానీ ముసలి సుధీర్ బాబు పాత్రకి ఇంకొకరి చేత డబ్బింగ్ చెప్పడం అనేది కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది. సుధీర్ బాబు గొంతు మనకి తెలిసి ఉండడంతో ఈ గొంతు అంత పెద్దగా సూట్ అవ్వలేదు ఏమో అనిపిస్తుంది.

mama mascheendra movie review

డీజే పాత్ర పోషించిన సుధీర్ బాబు తన పాత్ర పరిధి మేరకు చేశారు. హీరోయిన్స్ కి, హర్షవర్ధన్ కి మంచి పాత్రలు ఉన్నా కూడా ఇంకా బాగా చూపించి ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. పాటలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. అలా ఫ్లోలో వెళ్లిపోతాయి అంతే. కొన్ని సీన్స్ కూడా కన్విన్సింగ్ గా అనిపించవు. అసలు పరశురామ్​ అనే వ్యక్తికి తన మేనల్లుళ్ల మీద ఎందుకు పగ? క్లైమాక్స్ కి వచ్చేసరికి హీరో ఎందుకు మారిపోతాడు? ఇవన్నీ ఇంకా బాగా చూపించి ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • సుధీర్ బాబు
  • నిర్మాణం విలువలు
  • కొన్ని కామెడీ సీన్స్
  • దర్శకుడు ఎంచుకున్న పాయింట్

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ స్క్రీన్ ప్లే
  • పెద్ద సుధీర్ బాబు పాత్రకి సూట్ అవ్వని డబ్బింగ్
  • లాజిక్ మిస్ అయిన కొన్ని సీన్స్
  • హడావిడిగా నడిచే క్లైమాక్స్

రేటింగ్ :

2.5/5

ట్యాగ్ లైన్ :

పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, కథ నుండి కొత్తదనం ఆశించకుండా, కేవలం సుధీర్ బాబు కోసం, ఆ పాత్రల ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది అని చూద్దాం అనుకునే వారి కోసం మామా మశ్చీంద్ర సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : హీరోయిన్ “కుష్బూ” కి ఈ గుడి వాళ్ళు పూజ ఎందుకు చేసారు..? అసలు విషయం ఏంటంటే..?


End of Article

You may also like