Ads
ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా జోరుగా పెళ్లి సందడి నెలకొంది. కొందరు సినీ తారలు తమ ప్రేమించిన నటీనటుల్ని పెళ్లి చేసుకోవడంతో ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున సందడి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ కమీడియన్ యాక్టర్ అయిన అలీ కుమార్తె నిశ్చితార్థం ఆగస్టు 25వ తేదీన ఘనంగా జరిగింది.
Video Advertisement
అలీ కూతురు ఫాతిమా నిశ్చితార్థ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.తెలుగు ప్రేక్షకులకు అలీ గురించి ఎటువంటి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆయన ఎన్నో సినిమాల్లో తన టాలెంట్ తో హాస్యాన్ని పండించి అందరిని ఆనందింప చేశారు .అతను తెలుగులో 1000 కంటే ఎక్కువ చిత్రాలలో నటించాడు. గత కొద్ది కాలంగా సినిమాల్లోనే కాకుండా టీవీ షోలో కూడా ఆలీ చురుకుగా పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం ఎంగేజ్మెంట్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ట్రెండింగ్ గా ఉన్నాయి. పలువురు అలీ అభిమానులు కాబోయే వధూవరులకు తమ ఆశీస్సులు శుభాకాంక్షలు కామెంట్ల రూపం లో తెలియజేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అసలు అలీ కి కాబోయే అల్లుడు ఎవరో తెలుసు కోవాలని పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. అయితే అలీ మాత్రం తనకు కాబోయే అల్లుడికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తుంది.
అలీ కుమార్తె ఫాతిమా డాక్టర్ కోర్స్ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో కాబోయే అల్లుడు కూడా డాక్టర్ అయితేనే బాగుంటుందని భావించిన అలీ పెద్ద డాక్టర్ ను అల్లుడిగా సెలెక్ట్ చేశారంట. అలీ అల్లుడు షేక్ షహయాజ్ ఎంతో ఉన్నతమైన ఫ్యామిలీ కి చెందిన వాడు. అతను డాక్టర్ వృత్తితో పాటు సమాజ సేవ చేయడం అలీ కి ఎంతో ఇష్టమని సమాచారం. ఈ వార్తలు వైరల్ కావడంతో అలీ కూతురుకు తగ్గ వరుడిని తీసుకువచ్చారంటూ అభిమానులు తమ శుభాకాంక్షలు తెలిపారు.
End of Article