కమెడియన్ రఘు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రఘు చాలా సినిమాల్లో నటించి నవ్వించాడు. తన కామెడీ తో అందరినీ ఆకట్టుకున్నాడు. రఘు ఒకటి కాదు రెండు కాదు చాలా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు. లక్ష్మీ, కిక్, దిల్, యోగి, పిల్ల జమిందార్, అదుర్స్, ఊసరవెల్లి, టెంపర్ మొదలైన సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు రఘు.

Video Advertisement

ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో తో బాగా పాపులర్ అయిపోయాడు. జబర్దస్త్ షో కి వెళ్ళిన తర్వాత రోలర్ రఘుగా అందరికీ పరిచయమై ఫేమస్ అయిపోయాడు.

లాక్ డౌన్ టైం లో మాత్రం రఘు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఓ లగ్జరీ ఇంటికి యజమాని అయిపోయాడు. ఇంత తక్కువ టైం లో ఎలా అన్ని డబ్బులు సంపాదించాడంటూ అనేక అనుమానాలు వస్తున్నాయి. లిక్కర్ షాప్ లో రఘు లిక్కర్ అమ్ముతూ కనపడిన ఒక వీడియో కూడా వైరల్ అయింది అప్పట్లో. అవకాశాలు లేక పోవడంతో రఘు ఈ విధంగా మారిపోయాడని అప్పట్లో వార్తలు కూడా వినపడ్డాయి. లిక్కర్ బిజినెస్ బాగా రఘు కి క్లిక్ అయింది. తక్కువ టైం లోనే బాగా డబ్బులు సంపాదించాడని క్లియర్ గా తెలిసి పోతోంది.

నిజానికి రఘు ఇల్లు చూస్తే షాక్ అయిపోతారు. పెద్ద భవనం మాదిరి ఉంది ఇల్లు. ఇంటి ఫోటోలు, వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రఘు ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలి లో పుట్టాడు. పుట్టింది తెనాలిలో అయినా పెరిగింది అంతా కూడా హైదరాబాద్ లోనే. రఘు తండ్రి పేరు వెంకటరావు. ఈయన ఇండియన్ ఆర్మీలో పని చేసేవారు. రఘు ఎంబీఏ చదువుకున్నాడు కొన్నాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేశాడు. రఘు దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు రఘు భార్య పేరు వాణి. ఆగస్టు 4న రఘు తండ్రి చనిపోయారు.