Ads
Comedian Sudarshan: సినీ రంగం లో అవకాశాలు రావాలంటే అనుకున్నంత ఈజీ ఏం కాదు. పొట్ట చేత పట్టుకుని కృష్ణానగర్ లో అడుగు పెట్టి ఎన్నో కష్టాలను భరించి ఈ స్థాయికి చేరుకున్నారు. నిత్యం మనల్ని అలరించే యాక్టర్స్ ఈ స్థాయికి వచ్చే క్రమం లో పడిన కష్టాలు వింటే మనసు ఏదోలా అయిపోతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో నటుడిగా ఎదిగే క్రమం లో తాను ఎన్ని కష్టాలు పడ్డాడో వివరించాడు కమెడియన్ సుదర్శన్.
Video Advertisement
Comedian Sudarshan
పలు సూపర్ హిట్ సినిమాల్లో భాగమై కమెడియన్ గా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుదర్శన్..నెల్లూరు యాసలో డైలాగులు చెబుతూ, నేచురల్‌గా యాక్ట్ చేస్తూ అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ‘‘నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో యూసప్ గూడలో ముగ్గురం స్నేహితులం కలిసి ఒక రూమ్ రెంట్ కి తీసుకున్నాం. అక్కడ అగ్గిపెట్టెల్లా చిన్న రూమ్స్..ఎటాచ్‌డ్ బాత్రూమ్ లతో ఉండేవి. ఒక్కోసారి బాత్రూమ్ నీళ్లు బయటకు వచ్చేసేవి. అప్పుడు పడుకోవడానికి కుదిరేది కాదు.
Also Read: “వెయ్యినొక్క జిల్లాల వరకు” లాగానే… తెలుగులో “రీమిక్స్” అయిన 19 పాత సూపర్ హిట్ పాటలు..!
అలాగే మా రూమ్ లో ఒక్కోసారి నీళ్లు వచ్చేవి కావు. అప్పుడు ఎప్పుడు పది గంటలు అవ్వుద్దా అని వెయిట్ చేసే వాళ్ళం. పొద్దున పది గంటలకు మా రూమ్ పక్కనే ఉండే బిగ్ బజార్ ఓపెన్ చేసేవారు. ఆ షో రూమ్‌కి వెళ్లి అక్కడ వాష్ రూమ్‌లను ఉపయోగించుకునేవాళ్లం..” అని సుదర్శన్ చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం స్టార్లు గా ఉన్న నటులు ఇలా ఇబ్బందులు పడి వచ్చిన వాళ్లే కదా అని అనుకుంటున్నారు ఫాన్స్.
అందరికి కృష్ణా నగర్ కష్టాలు తప్పవు అని అర్థం అవుతోంది. కొందరు బయటకు చెప్పుకుంటున్నారు.. మరికొందరు చెప్పుకోవట్లేదు అదే తేడా.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ నేను సినీ ఇండస్ట్రీలో పడ్డ ఇబ్బందులు పగవాడికి కూడా రాకూడదని అన్నారంటే.. నచ్చిన వృత్తి కోసం ఆయన ఎలాంటి కష్టాలను ఆయన ఫేస్ చేసుంటారో అర్థం చేసుకోవచ్చు.
End of Article