“ఇంత మంచి సీన్ ని ఇలా కామెడీ చేశారు ఏంటి..?” అంటూ… నితిన్ “ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్” మూవీపై కామెంట్స్..!

“ఇంత మంచి సీన్ ని ఇలా కామెడీ చేశారు ఏంటి..?” అంటూ… నితిన్ “ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్” మూవీపై కామెంట్స్..!

by Mounika Singaluri

యూత్ హీరో నితిన్ నటించిన ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరెకెక్కింది. ప్రముఖ రైటర్- డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కించారు. నితిన్ హోమ్ బ్యానర్ పైన ఈ సినిమాను నిర్మించారు.

Video Advertisement

రాజశేఖర్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటించారు. నితిన్ కి జోడిగా శ్రీ లీల నటించింది. ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషన్ కంటెంట్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా మీద ముందు నుంచి కూడా కొంచెం పాజిటివ్ బజ్ ఉంది. నితిన్ ఈ సినిమాతో హిట్ కొట్టి తిరిగి ఫామ్ లోకి వస్తాడని అభిమానులు అంచనా వేస్తున్నారు.

extra ordinary man review

అయితే ఎక్స్‌ట్రా సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో పలు హిట్ సినిమాలను స్పూఫ్ లుగా చేశారు. బాహుబలి, శ్రీమంతుడు లాంటి సినిమాల్లో సీన్లను పేరడీగా చేశారు. ఇదంతా సినిమాలో భాగంగా నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా నటించడంతో ఆ సీన్లు అందుకు తగ్గట్టుగా తీశారు. అయితే ఈ సినిమాలో కాంతారా సినిమాలో క్లైమాక్స్ సీన్ కూడా పేరడీ చేశారు. కాంతర సినిమాకి లాస్ట్ అరగంట ప్రాణంగా నిలిచింది.

extra ordinary man review

క్లైమాక్స్ సీన్ లో రిషబ్ శెట్టి నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. అలాంటి సీన్ ను నితిన్ పేరడీ చేశారు. కామెడీ పరంగా చూస్తే ఈ సీన్ బాగానే ఉంది కానీ, చాలామంది కాంతారా అభిమానులు ఈ సీన్ ఇలా చేసినందుకు ఇబ్బంది పడుతున్నారు. వెండితెరపై వచ్చిన అద్భుతమైన సీన లలో కాంతర క్లైమాక్స్ కి చోటు ఉంటుంది. అలాంటి సీను కామెడీ కోసం వాడుకోవడం ఎంతవరకు సబబు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


You may also like

Leave a Comment