యంగ్ హీరో రామ్‌ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్కంద’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ను గ్రాండ్ గా నిర్వహించారు.

Video Advertisement

ఈ ఈవెంట్ లో మేకర్స్ స్కంద మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. బోయపాటి శీను సినిమా పై ఉండే అంచనాలు  తగ్గకుండా మాస్ గా చూపించారు. ఇస్మార్ట్ శంకర్ మూవీకి భిన్నంగా హీరో రామ్ ఎనర్జీ నెక్స్ట్ రేంజ్ లో చూపించారు. అయితే స్కంద మూవీలోని ఒక సీన్ వార్తలోకి ఎక్కింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రామ్‌ పోతినేని, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం స్కంద. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్​వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు నట సింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ ఈవెంట్ లో స్కంద ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది ఎప్పటిలానే బోయపాటి శైలిలో ఊరమాస్ గా తెరకెక్కింది.హీరో రామ్ ను పవర్ ఫుల్ మాస్ హీరోగా చూపించారు. పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ బ్లాక్స్ తో ట్రైలర్ ను కట్ చేశారు.  రామ్ పోతినేని గెడ్డంతో రఫ్ లుక్ లో ఉండగా, ఈ మూవి కూడా రెండు ఫ్యామిల ల మధ్య ఉండే పగ, ప్రతీకారం లాంటి అంశాలతో తెరకెక్కినట్టు తెలుస్తోంది. అయితే స్కంద మూవీలోని ఒక సన్నివేశం వార్తల్లో నిలిచింది.
హీరో రామ్ పోతినేని ఒక మనిషిని ఒక ప్లేట్ తో చంపేస్తాడని అని ఆ సీన్ చూస్తే అర్దం అవుతోంది. దాంతో ఆ సీన్ కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఇది లాజిక్ లేని సన్నివేశం అంటున్నారు. నెటిజెన్లు ఈ సీన్ ని ట్రోల్ చేస్తున్నారు. ప్లేట్ తో చంపి ఆ రక్తంతో అభిషేకం అని ఒకరు కామెంట్ చేశారు.

Also Read: గుప్పెడంత మనసు సీరియల్ “జగతి” ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా..? దీనికి కారణం ఏంటంటే..?