ఇలాంటి ఫోటోలకి పూజ చేయడం ఏంటి..? సీరియల్స్ లోనే ఇలాంటివి జరుగుతాయి ఏమో..!

ఇలాంటి ఫోటోలకి పూజ చేయడం ఏంటి..? సీరియల్స్ లోనే ఇలాంటివి జరుగుతాయి ఏమో..!

by Mohana Priya

Ads

సాధారణంగా సీరియల్స్ లో ఈ మధ్య వింత వింత సీన్స్ జరుగుతున్నాయి. కొన్ని సీన్స్ మీద కామెంట్స్ వస్తున్నాయి. కానీ అప్పటికి కూడా సీరియల్స్ లో ఇలాంటి సీన్స్ ఆగట్లేదు. ఒకసారి ఒక సీరియల్ లో విమానంలో నిశ్చితార్థం చేస్తారు. ఇంకొక సీరియల్ లో ఉయ్యాల కోసం వేసిన చీర మనిషిని చుట్టుకుంటుంది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇవి సీరియస్ గా చేసినా కూడా కామెడీగానే అనిపిస్తున్నాయి. అందుకనే వీటి మీద కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి సినిమా మరొకటి జరిగింది. ఈ సీరియల్ లో హీరోయిన్ ఒక ఫోటోకి పూజ చేసి, అగర్బతులు వెలిగించింది.

Video Advertisement

comments on a serial scene

పూజ చేసి, అగర్బతులు వెలిగిస్తే అందులో వింత ఏం ఉంది అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే అసలు వింత ఉంది. ఆ అమ్మాయి పూజ చేసేది మోనాలిసా విగ్రహానికి. మోనాలిసా ఫోటో ఉంటే ఆ ఫోటోకి పూజ చేసి, అగర్బత్తి వెలిగించి, పూలు పెడుతుంది. మోనాలిసా ఫోటో తెలియకపోవడం ఏంటో, దానికి అగర్బత్తి వెలిగించడం ఏంటో, అసలు సీరియల్స్ లో ఇలాంటి సీన్స్ ఎందుకు పెడుతున్నారో కూడా ఎవరికి తెలియట్లేదు. హీరోయిన్స్ అమాయకంగా ఉండడం అనేది ఒక కామన్ పాయింట్ అయిపోయింది. కొన్ని సీరియల్స్ లో ఆ అమ్మాయికత్వం మరీ ఎక్కువగా అయిపోయి ఇలా తెలిసి తెలియనితనంగా అనిపిస్తుంది. ఇదంతా చూస్తూ ఉంటే వాళ్ళు అమాయకుల లాగా కాదు, తెలివి తక్కువ వారిలాగా కనిపిస్తూ ఉంటారు.

comments on a serial scene

సీరియల్స్ లో అలా అమాయకంగా ఉన్న వాళ్ళు హీరోయిన్, తెలివిగా తన కాళ్ళ మీద తన నిలబడి స్టైల్ గా ఉన్న అమ్మాయి విలన్. ఇది అప్పట్లో ఫాలో అయ్యే వాళ్ళు. కానీ ఇప్పుడు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. సీరియల్స్ అన్నీ కూడా చివరికి ఒకటే కాన్సెప్ట్ వరకు వెళ్తున్నాయి. సీరియల్స్ మీద సాధారణంగానే కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి సీన్స్ ఉంటే ఇంకా ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయి. సీరియల్స్ లో సినిమాలో మ్యూజిక్ వాడడం అనే విషయం మీద కూడా చాలా ఎక్కువగా కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అయితే ఈ సీన్ చూసినవాళ్లు అందరూ కూడా అలా చేసింది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సీన్స్ కేవలం మన సీరియల్స్ లో మాత్రమే ఉంటాయి ఏమో అని అంటున్నారు.

watch video :

ALSO READ : రామ్ చరణ్ “జరగండి” పోస్టర్‌లో ఇది గమనించారా..? ఈ పుస్తకానికి ఇంత గొప్ప చరిత్ర ఉందా..?


End of Article

You may also like