నటన పై ఉన్న ఆసక్తితో ఇప్పటివరకు ఎంతో మంది నటీనటులు గవర్నమెంట్ ఉద్యోగాలను సైతం వదులుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వారిలో కొందరు స్టార్ డమ్ సొంతం చేసుకుని దశాబ్దాల పాటు అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. అందుకు ఉదాహరణ సౌత్ సూపర్ స్టార్ రజినికాంత్.

Video Advertisement

ఇటీవల ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ నటన పై ఉన్న పిచ్చి ప్రేమతో తన జాబ్ కు రాజీనామా చేశారు. ఆ విషయం సంచలనంగా మారింది. అయితే ఆ ఐఏఎస్‌ ఆఫీసర్ ఎవరు? ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం..
ఉత్తర్‌ప్రదేశ్‌ కేడర్‌ 2011 బ్యాచ్‌ కు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్ అభిషేక్‌ సింగ్‌ నటన మీద ఉన్న ఇష్టంతో సంచలన నిర్ణయం తీసుకుని, ఉద్యోగానికి రిజైన్ చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు కూడా ధ్రువీకరించారు. అభిషేక్ సింగ్‌కు యాక్టింగ్, మోడలింగ్‌‌ అంటే చాలా ఆసక్తి ఉండడంతో ఒక వైపు ఐఏఎస్‌ అధికారిగా ఢిల్లీ సచివాలయంలో ముఖ్యమైనహోదాలో కొనసాగారు. మరో వైపు తనకు ఇష్టం అయిన నటన, మోడలింగ్‌‌ రంగాలలో రాణించారు.
అభిషేక్‌ సింగ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన ‘ఢిల్లీ క్రైమ్‌ సీజన్‌- 2’ లో ఇన్వెస్టిగేషన్‌ అధికారి క్యారెక్టర్ లో నటించి. మంచి గుర్తింపును తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఓటీటీలలో మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకుంటూ, మోడల్ గా  ఆకట్టుకుంటున్నారు. అభిషేక్‌ సింగ్‌ మొదటిసారి నటించిన షాట్‌ ఫిలిం ‘చార్ పండ్రా’. దీనిని టీ సిరీస్‌ సంస్థ  రూపొందించింది.
ఈ సాంగ్ లో అభిషేక్‌ ప్రేమికుడిగా అద్భుతంగా నటించి, మెప్పించాడు. ఐఏఎస్‌ ఆఫీసర్ అయినప్పటికీ ఒక యాక్టర్ గా అద్భుత నటనను కనబరిచినందుకు ఆడియెన్స్ ఆయన నటనకు ఫిదా అయ్యారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన 4 రోజులకే యూట్యూబ్‌ లో ట్రెండింగ్‌ గా మారింది. ఇక ఇప్పటి వరకు ఆ సాంగ్ కు యూట్యూబ్‌ లో 560 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అభిషేక్‌ సింగ్‌ కు ఇన్‌స్టాగ్రామ్ లో ఐదు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Also Read: రూల్స్ చెప్తారు.. కానీ ఫాలో అవ్వరు..! “ఆచార్య” మూవీలో ఈ సీన్ గమనించారా..?