“జనాలకి మీ పనులతో ఇలాంటి తప్పుడు సందేశం ఇస్తారా..? అంటూ… “అమలా పాల్” మీద కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

“జనాలకి మీ పనులతో ఇలాంటి తప్పుడు సందేశం ఇస్తారా..? అంటూ… “అమలా పాల్” మీద కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

by Harika

Ads

అమలాపాల్ డైరెక్టర్ విజయ్ తో ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. ఆ తర్వాత జగత్ దేశాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతను ఒక ఈవెంట్ ఆర్గనైజర్ గా చేస్తున్నట్లు సమాచారం. కామన్ ఫ్రెండ్స్ ద్వారా జగత్ దేశాయ్ అమలాపాల్ కి పరిచయం అయినట్లు, అది కాస్త ప్రేమకి దారి తీసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా అమలాపాల్ కొత్త సంవత్సరం ప్రారంభంలో తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసిన విషయం అందరికీ తెలిసిందే.

Video Advertisement

comments on amala paul

ఈమె తన ప్రియుడు జగత్ దేశాయ్ తో గత ఏడాది జూన్ నుంచి డేటింగ్ లో ఉంది. కేరళలోని కొచ్చిలో నవంబర్ 5 న అమలాపాల్ జగత్ దేశాయ్ ని పెళ్లి చేసుకుని వివాహ బంధంతో ఒకటయ్యారు. పెళ్లికి పది రోజుల ముందు అమలాపాల్ పుట్టినరోజు నాడు ఆమెకి ప్రపోజ్ చేశాడు జగత్ దేశాయ్.అందుకు ఆమె ఒప్పుకోవటం, 10 రోజుల్లో పెళ్లి జరిగిపోవడం ఆపై రెండు నెలలకే గర్భవతి అంటూ వెల్లడించటం అని వెంట వెంటనే జరిగిపోయాయి. ఆ తర్వాత ఆమె కెరియర్ కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలపై దృష్టి కేంద్రీకరించింది.

పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. గర్భవతిగా తన ఆరోగ్యం గురించి వరుసగా అప్డేట్స్ ఇస్తూ వస్తోంది. బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను, భర్తతో గడిపిన ఆనంద క్షణాలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఒక వీడియో మాత్రం నెటిజన్స్ ఆగ్రహానికి గురైంది. అదేంటంటే ఏడు నెలల గర్భంతో భర్తతో కలిసి పబ్ లో డాన్సులు వేస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది అమలాపాల్. అది చూసిన నెటిజన్స్ యువతకు మీరు ఇచ్చే సందేశం ఇదేనా కాస్త ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి అని తెగ ఫైర్ అవుతున్నారు. అమలాపాల్ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

watch video :


End of Article

You may also like