“యానిమల్” ట్రైలర్ తో దొరికిపోయిన సందీప్ రెడ్డి వంగా..! ఆ తెలుగు మూవీకి కాపీ అంటూ నెటిజెన్ల కామెంట్స్..?

“యానిమల్” ట్రైలర్ తో దొరికిపోయిన సందీప్ రెడ్డి వంగా..! ఆ తెలుగు మూవీకి కాపీ అంటూ నెటిజెన్ల కామెంట్స్..?

by kavitha

Ads

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా. ‘యానిమల్’ గురించే వినిపిస్తోంది. ఈ మూవీకి దేశవ్యాప్తంగా క్రేజ్ మామూలుగా లేదు. సినిమా నిడివి ఎక్కువైనా సరే చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Video Advertisement

రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి, మూవీ పై మరిన్ని అంచనాలను పెంచేసింది. అయితే ఈ ట్రైలర్ ను చూసిన తెలుగు ఆడియెన్స్ ఆ తెలుగు సినిమా కాపీ చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ మూవీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

animal
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం యానిమల్. తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో హీరోతో పాటు, పలు కీలక పాత్రలలో బాలీవుడ్‌కు చెందిన వారే నటించారు. అయినప్పటికీ ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న మూవీ అవడంతో ఈ మూవీ పై ఇక్కడ కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
animalఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ లో తండ్రి కొడుకుల సెంటిమెంట్ హైలైట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ ట్రైలర్ చూసిన తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఒక తెలుగు మూవీలా అనిపించింది. ఆ మూవీలో హీరో వెంకటేష్ హీరోగా నటించారు. అదే ధర్మచక్రం. ఈ మూవీకి సురేష్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. 1996 లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో గిరీష్ కర్నాడ్ వెంకటేష్ తండ్రి పాత్రలో నటించారు. ఆ సినిమా కూడా తండ్రీ, కుమారుల రిలేషన్‌ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.
animalధర్మచక్రంలో వెంకటేష్ అగ్రెసివ్, యారిగెంట్ యాటిట్యూడ్‌తో కనిపిస్తాడు. ఇక యానిమల్ మూవీలో కూడా రణ్‌బీర్ కపూర్ కూడా అలాగే కనిపించడంతో సందీప్ రెడ్డి ధర్మచక్రం సినిమా నుండే యావిమల్ స్టోరీ లైన్‌ను తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. కాపీ, లేదా ఇన్‌స్పిరేషన్ అనేది  తెలియదు కానీ సందీప్‌ రెడ్డి దొరికిపోయారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : యానిమల్ లో రణబీర్ సోదరిగా నటించింది ఎవరో తెలుసా? హీరోయిన్ కి ఉన్న క్రేజ్ ఉంది…!


End of Article

You may also like