తెలుగు ఆడియెన్స్ కంటెంట్ నచ్చితే భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తుంటారు. అది చిన్న సినిమానా, స్టార్ హీరో సినిమానా, డబ్బింగ్ మూవీనా అనేది పట్టించుకోకుండా బ్రహ్మరథం పడతారు. ఈ మధ్య కాలంలో అలా పలు ఇతర భాషల సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యి, విజయం సాధించాయి.

Video Advertisement

ఈ క్రమంలోనే మరో కన్నడ సినిమా ‘బాయ్స్‌ హాస్టల్‌’ అనే టైటిల్ తో తెలుగులో అనువాదం అయ్యి, తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ ను చూసినవారు ఆ డైలాగ్ పెట్టాల్సిన అవసరం ఏం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ ఏడాది కన్నడ ఇండస్ట్రీలో రిలీజ్ అయిన చిత్రాలలో బ్లాక్‌ బస్టర్ హిట్ అందుకున్న సినిమాలలో ‘హాస్టల్‌ హుడుగురు బేకాగిద్దరే’ మూవీ ఒకటి. ఈ చిత్రానికి నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ యూత్‌ పుల్  కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపొందిన ఈ మూవీ, చిన్న సినిమాగా జులై 26న రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఆ సినిమానే ‘బాయ్స్‌ హాస్టల్‌’ అనే టైటిల్ తో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేయబోతున్నారు.
ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 26న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా  ‘బేబీ’ మూవీ యూనిట్ తో ‘బాయ్స్‌ హాస్టల్‌’ ట్రైలర్ ను లాంచ్ చేయించారు. అయితే ఈ ట్రైలర్‌ చివర్లో ఆంధ్రప్రదేశ్‌ కు సంబంధించిన డైలాగ్‌ ఉంటుంది.
ఒక కుర్రాడు ‘మేం ఆంధ్రా వాళ్లం, పక్కా తెలుగోళ్లం, తోపు కాపులురా ఇక్కడ’ అని అనగానే, మరొకరు “ఒరేయ్ తప్పు తప్పుగా మాట్లాడకు, ఆంధ్రా అంటే కాపులే కాదు, కమ్మోళ్లు కూడా” అని అంటాడు. ఈ డైలాగ్‌ లు సాధారణంగా అయితే ప్రజలు మామూలుగా మాట్లాడుకునేవే. కానీ ప్రస్తుతం ఉన్న కండిషన్స్ లో ఇలాంటి డైలాగ్స్ అవసరమా అని అంటున్నారు.

Also Read: “సన్యాసి అయినా కూడా..!” అంటూ… స్పందించిన రజనీకాంత్..! ఏం అన్నారంటే..?