ఒక హీరో చేయాల్సిన మూవీని మరొక హీరో చేయడం అనేది  సినీ పరిశ్రమలో సాధారణంగా జరుగుతూ ఉండే విషయమే. స్టార్ హీరోలు కొన్ని కథలు తమకు సెట్ అవ్వవని వాటిని రిజెక్ట్ చేస్తుంటారు. కట్ చేస్తే వారు వదిలేసిన కథతో మరొక హీరో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంటుంటారు.

Video Advertisement

కొన్ని రోజుల తరువాత ఎవరి ద్వారానో ఆ విషయం  బయటకు వచ్చినపుడు ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ అలాంటి బ్లాక్‌బస్టర్ ను రిజెక్ట్ చేసినందుకు బాధపడుతుంటారు. ఇదంతా ఎందుకు అంటే తాజాగా మెగా అభిమానులు కూడా మెగాస్టార్ వదులుకున్న ఒక ప్రాజెక్ట్ గురించి అలానే బాధపడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అశ్వనీదత్ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో నాలుగు చిత్రాలను నిర్మించారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది. జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని వుంది, ఇంద్ర చిత్రాలు బ్లాక్ బస్టర్లు హిట్ గా నిలిచాయి. కానీ ఆ తరవాత తీసిన ‘జై చిరంజీవ’ అంతగా ఆడలేదు. ఆ మూవీ తరవాత మళ్లీ చిరంజీవితో మూవీ చేయాలని అశ్వనీదత్ ప్రయత్నించారట. కానీ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో అది కుదరలేదట. అయితే మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత  ఖైదీ నం.150 మూవీతో విజయాన్ని సాధించారు. అదే సమయంలో దర్శకులు రాజ్ మరియు డీకే ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ కథతో ప్రొడ్యూసర్ అశ్వనీదత్‌ని కలిశారు. ఈ కథను మెగాస్టార్ చిరంజీవితో చేయాలని అశ్వనీదత్‌ భావించి, ఫ్యామిలీమ్యాన్ స్క్రిప్ట్‌ని చిరంజీవికి వినిపించారు. అది చిరంజీవికి బాగా నచ్చిందట. కానీ ఇందులో హీరో గూఢచారి లాంటి పాత్ర కావడంతో చిరుకు నచ్చేసింది. అయితే  హీరో క్యారెక్టర్ కు ఇద్దరు పిల్లలు ఉండడం చిరంజీవిని ఆలోచించేలా చేశాయి.
దాంతో ఈ విషయాన్ని దర్శకులు రాజ్ మరియు డీకేకు చెప్తే, పిల్లల పాత్రల్ని తొలగించడానికి కూడా సిద్ధం అయిపోయారు. అయితే చిరంజీవి అప్పుడే రీఎంట‍్రీ ఇవ్వడం, ఆ సమయంలో ఇలాంటి కథ తనకు సెట్ అవుతుందో లేదో అని పక్కన పెట్టారని నిర్మాత అశ్వనీదత్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు బాధపడుతున్నారు. దానికి కారణం ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ గ్లోబల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంది.

Also Read: సినిమా ఓకే చేయడానికి “వైష్ణవి చైతన్య” ఈ కండిషన్స్ పెడుతున్నారా..? అవి ఏంటంటే..?