“ఇలా ఎలా వదిలేశారు..? సరిగ్గా చూసుకోవాలి కదా..?” అంటూ… “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” మూవీ మీద కామెంట్స్..! విషయం ఏంటంటే..?

“ఇలా ఎలా వదిలేశారు..? సరిగ్గా చూసుకోవాలి కదా..?” అంటూ… “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” మూవీ మీద కామెంట్స్..! విషయం ఏంటంటే..?

by Harika

Ads

విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. కృష్ణ చైతన్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకి, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. రత్నాకర్ అనే ఒక వ్యక్తి చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. లంకల రత్నాకర్ టైగర్ రత్నాకర్ గా ఎలా మారాడు అనేది ఈ సినిమా మెయిన్ స్టోరీ. సినిమా చూస్తున్నప్పుడు చాలా సినిమాలు గుర్తుకు వస్తాయి.

Video Advertisement

gangs of godavari movie review

ముఖ్యంగా రంగస్థలం, పుష్ప సినిమాలు చాలా ఎక్కువగా గుర్తుకు తెచ్చేలాగా కొన్ని సీన్స్ ఉంటాయి. అయితే, ఈ సినిమాలో ఒక విషయం మీద మాత్రం కామెంట్స్ వస్తున్నాయి. అదేంటంటే, సినిమా మొత్తం గోదావరి నేపథ్యంలోనే నడుస్తుంది. సినిమా టైటిల్ లోనే గోదావరి అని ఉంది. అయితే సినిమాలో గోదావరి యాస మాత్రం చాలా తక్కువగా మాట్లాడుతారు. సాధారణంగా వీళ్ళందరూ గోదావరిలో నివసించేవారు కాబట్టి ఆ ఈ యాస ఎక్కువగానే మాట్లాడతారు. కానీ ఈ సినిమాలో ఆ విషయం మీద ఎక్కువగా శ్రద్ధ తీసుకోలేదు. హీరో కొన్ని చోట్ల మాట్లాడుతారు కానీ కొన్ని చోట్ల మళ్ళీ మామూలుగానే మాట్లాడుతారు. ఒక ఫ్లో లో ఉండదు. సినిమాలో ఎక్కువగా గోదావరి యాస మాట్లాడింది అంటే అంజలి మాత్రమే. అంజలి తనకి ఇచ్చిన డైలాగ్స్ లో చాలా వరకు గోదావరి యాస లోనే మాట్లాడారు.

కానీ మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు అనిపిస్తుంది. సినిమా కనెక్ట్ అవ్వాలి అంటే ఆ సినిమా ప్రాంతంలో జరిగిన భాషలోనే మాట్లాడాలి. కానీ ఈ సినిమాలో అది కొన్ని చోట్ల సరిగ్గా లేదు అనిపిస్తుంది. అంతే కాకుండా గోపరాజు రమణ గారు ఈ పాత్రకి సూట్ అవ్వలేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. తన పాత్ర తను చాలా బాగా పోషించినా కూడా, ఈ పాత్రకి ఇంకా ఎవరినైనా తీసుకుని ఉంటే బాగుండేది అంటూ చాలా మంది అంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ విషయాల మీద కామెంట్స్ వస్తున్నాయి.


End of Article

You may also like