గుంటూరు కారం సినిమాలో ఈ పొరపాటు గమనించారా..? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

గుంటూరు కారం సినిమాలో ఈ పొరపాటు గమనించారా..? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

by Mohana Priya

సూపర్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు సినిమా బృందం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. మహేష్ బాబు, శ్రీలీల ఇచ్చిన ఇంటర్వ్యూ ఇవాళ బయటికి వచ్చింది.

Video Advertisement

తర్వాత కూడా సినిమా బృందం మరికొన్ని ఇంటర్వ్యూలు ఇస్తారు అని తెలుస్తోంది. తల్లి సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. సినిమాకి సంబంధించిన చాలా విషయాలని మహేష్ బాబు, శ్రీలీల ఈ ఇంటర్వ్యూలో చెప్పారు.

guntur kaaram movie review

ఇందులో మహేష్ బాబు తాగింది నిజమైన బీడీ కాదు అని, సినిమాలో వాడిన బీడీని లవంగం ఆకులతో తయారు చేశారు అని మహేష్ బాబు చెప్పారు. అయితే, ఇదిలా ఉండగా సినిమాలు అన్న తర్వాత పొరపాట్లు జరగడం చాలా సహజం. ఎన్నో సినిమాల్లో ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక పొరపాటు మీద ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. అదేంటంటే, సినిమాలో హీరో అయిన రమణ సినిమా మొత్తం బీడీ తాగుతూనే ఉంటాడు.

guntur kaaram movie review

అతను బీడీ తరచుగా కాలుస్తూ ఉంటాడు కాబట్టి అది కచ్చితంగా ఆరోగ్యానికి హానికరం. అయితే, హరిదాసుని కొట్టాక హరిదాసుకి మేకు గుచ్చుకుంటుంది. దాంతో చాలా రక్తం పోతుంది. హరిదాసుకి రక్తం ఇవ్వడానికి ఒక మనిషి కావాలి అని అడుగుతున్నప్పుడు, రమణ తన బ్లడ్ తీసుకోమని చెప్తాడు. ఈ సీన్ మీద కామెంట్స్ వస్తున్నాయి.

“ఒక బీడీ తాగే వ్యక్తి ఆరోగ్యం కచ్చితంగా నిలకడగా ఉండదు. అలాంటి ఒక వ్యక్తి రక్తం ఇంకొక వ్యక్తికి ఎలా ఎక్కిస్తారు? సీన్ రాసేటప్పుడు చూసుకోవాలి కదా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఇది కొత్త ఏమీ కాదు. అంతకుముందు చాలా సినిమాల్లో చాలా సీన్స్ లో లాజిక్ మిస్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాగే జరిగింది. అయితే మరి కొంత మంది మాత్రం, “ఇలాంటి చిన్న చిన్న విషయాలని పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది?” అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ సినిమా థియేటర్లలో నడుస్తోంది.


You may also like

Leave a Comment