Ads
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘బ్రో’ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ కి రీమేక్ గా బ్రో మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ జూలై 28న రీలజ్ కానుంది.
Video Advertisement
బ్రో మూవీ యూనిట్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ పలు ఆలయాలను దర్శిస్తూ, పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా శ్రీకాళహస్తిలో పూజలు నిర్వహించారు. అయితే ఆలయంలో చేసిన ఒక పనితో వివాదంలో చిక్కుకున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పలు ఆలయాలను దర్శిస్తూ, అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో అమీన్ పీర్ దర్గాను సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నాడు. ఆ తరువాత కాణిపాకం చేరుకుని కాణిపాకం వినాయకుడిని దర్శించుకుని, పూజలు నిర్వహించాడు. అక్కడి నుంచి సాయి ధరమ్ తేజ్ శ్రీకాళహస్తికి వెళ్లాడు.
సాయి ధరమ్ తేజ్ శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామికి సాయి ధరమ్ తేజ్ స్వయంగా హారతి ఇచ్చారు. ప్రస్తుతం అది వివాదాస్పదంగా మారింది. శ్రీకాళహస్తి సుబ్రహ్మణ్య స్వామికి పూజారి తప్ప వేరే వ్యక్తులు ఎవరు కూడా హారతిని ఇవ్వకూడదట. హీరో అయితే హారతి ఇవ్వడానికి ఎలా అనుమతి ఇచ్చారని గుడి అధికారులను భక్తులు ప్రశ్నిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఎలా హారతి ఇస్తాడని అతని పై కొందరు మండిపడుతున్నారు.
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తరువాత అంతగా బయటకు రాలేదు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఆయనను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. సాయి ధరమ్ తేజ్ ఇది తనకు పునర్జన్మ అని, భగవంతుడు పునర్జన్మ ప్రసాదించారని, అందుకే ఆలయాలను సందర్శించి, పూజలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించాడు.
Also Read: వెంకీ సినిమాలో “ట్రైన్” ఎపిసోడ్ చాలా సార్లు చూసి ఉంటారు..! కానీ ఈ విషయం గమనించారా..?
End of Article