టాలీవుడ్ లో ఆల్ టైం క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిల్చిన చిత్రం రవితేజ – శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన వెంకీ చిత్రం. 2004 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఇందులోని కామెడీ చాలా హిలేరియస్ గా ఉంటుంది. ఈ చిత్రం వచ్చి ఇప్పటికి 20 ఏళ్ళు అవుతున్నా ఈ సినిమా కి క్రేజ్ తగ్గలేదు.

Video Advertisement

ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న మీమ్స్ లో ఈ సినిమాలోని సన్నివేశాలు సోషల్ మీడియా లో వాడుతూ ఉంటారు. ఈ సినిమా గురించి ఎన్ని చెప్పుకున్న అది తక్కువే అవుతుంది. ముఖ్యంగా ఈ చిత్రం లోని ట్రైన్ ఎపిసోడ్ ఒక ట్రెండ్ సెట్టర్, ఇప్పటి వరకు ట్రైన్ లో అంత నిడివి ఉన్న సినిమాలే మన టాలీవుడ్ లో రాలేదు, వచ్చినా అవి సక్సెస్ కాలేదు.

did you notice this in venky movie..!!

ఈ మూవీ లోని ట్రైన్ ఎపిసోడ్ లో బ్రహ్మానందం, ఏవీయస్, రవి తేజ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా కామెడీ గా ఉంటాయి.  రోజంతా కస్టపడి కాసేపు రిలాక్స్ అవుదాం అనుకునే కొన్ని లక్షలాది మందికి మెడిసిన్ లాంటిది ఈ సినిమా. జనాలకు అంత ఇష్టం ఈ సినిమా అంటే.

did you notice this in venky movie..!!

అయితే ఈ సీన్స్ చూస్తున్నప్పుడు మన కాన్సంట్రేషన్ అంతా బ్రహ్మానందం, ఏవీయస్, రవి తేజ, స్నేహ మీదే ఉంటుంది. మనం గమనించలేదు కానీ బ్రహ్మానందం, ఏవీయస్ మాట్లాడుకుంటున్న సమయం లో రవితేజ ఫ్రెండ్స్ శ్రీనివాస రెడ్డి, రామచంద్ర స్నేహ తో పాటు ఉండే అమ్మాయికి లైన్ వేస్తూ ఉంటారు.

did you notice this in venky movie..!!

మనం బ్రహ్మానందం, ఏవీయస్ డైలాగ్స్ వింటూ ఉంటే మరో వైపు వాళ్ళు ఒకరిని చూసి మరొకరు సిగ్గు పడుతూ ఉంటారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఈ సినిమా.. ఈ సీన్స్ ఇన్ని సార్లు చూసాం కానీ ఇది ఇప్పటి వరకు గమనించలేదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

watch video :