“ఏమయ్యా బుచ్చి బాబు..? ఈ స్టోరీ ఏంటయ్యా..?” అంటూ… లీక్ అయిన “రామ్ చరణ్-బుచ్చి బాబు” సినిమా స్టోరీపై కామెంట్స్..!

“ఏమయ్యా బుచ్చి బాబు..? ఈ స్టోరీ ఏంటయ్యా..?” అంటూ… లీక్ అయిన “రామ్ చరణ్-బుచ్చి బాబు” సినిమా స్టోరీపై కామెంట్స్..!

by Anudeep

Ads

రామ్ చరణ్ కి RRR సినిమా ఒక మంచి హిట్ ని ఇచ్చింది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొన్ని సినిమాలలో హీరోగా నటిస్తూ ఉంటే మరి కొన్ని సినిమాలు నిర్మిస్తున్నారు రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ఆ తర్వాత ఇటీవల విడుదల అయిన గాడ్ ఫాదర్ సినిమా నిర్మాణ పనుల్లో కూడా రామ్ చరణ్ ఒక కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Video Advertisement

ఇక RC 16 మీద ఒక అప్డేట్ వచ్చింది. RC 16 కోసం కూడా చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గౌత‌మ్ తిన్న‌నూరి యువీ క్రియేష‌న్స్ తో ఓ సినిమా చ‌ర‌ణ్ చేస్తారని చెప్పారు.

ram charan's next movie with that young director..

కానీ RC 16 ప‌క్క‌న పెట్టేశారు. అయితే తాజాగా RC 16 విష‌యంపై ఒక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు అయిన ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. రంగస్థలం సినిమా తరహాలో RC 16 కోసం చెర్రీ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌ తో ఈ సినిమా రానుంది. ఈ చిత్రంలో చెర్రీ కి కాళ్లు ఉండవట.. వీల్ చెయిర్‌లోనే వుండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై మాత్రం కొంతమంది అసలు ఇలాంటి స్టోరీ రామ్ చరణ్ కి సూట్ అవుతుందా? ప్రేక్షకులు రామ్ చరణ్ ని ఇలాంటి రోల్ లో చూడగలుగుతారా? అని అంటున్నారు.

ram charan's next movie with that young director..

RC 15 అయితే..  శంకర్ దర్శకత్వంలో రానుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు జరుగుతోంది. రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి అంతకు ముందు వినయ విధేయ రామ సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటీ నటులు ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అలానే ఈ సినిమా పాన్-ఇండియన్ సినిమాగా రూపొందుతోంది. ఇందులో అంజలి కూడా ఒక ముఖ్య పాత్ర లో నటిస్తున్నారు. రామ్ చరణ్, అంజలి కలిసి ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ప్ర‌స్తుతం ఈ సినిమాలో ఓ పాట‌ను న్యూజిలాండ్‌లో షూట్ చేస్తున్నారు. పైగా ఈ పాట‌కు రూ.15 కోట్లు మేర‌కు ఖ‌ర్చు చేస్తున్నారట.


End of Article

You may also like