“1 కాదు 4… ఇంత సస్పెన్స్ అవసరమా..?” అంటూ… రామ్ చరణ్ “RC 15” టీం పై కామెంట్స్..! అసలు ఏం జరిగిందంటే..?

“1 కాదు 4… ఇంత సస్పెన్స్ అవసరమా..?” అంటూ… రామ్ చరణ్ “RC 15” టీం పై కామెంట్స్..! అసలు ఏం జరిగిందంటే..?

by Megha Varna

Ads

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నారు. ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారిపోయారు చరణ్. ప్రస్తుతం వరుస సినిమాతో బిజీగా ఉంటున్నారు కొన్ని సినిమాలలో హీరోగా నటిస్తూ ఉంటే కొన్ని సినిమాలను నిర్మిస్తున్నారు. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరించారు అలానే ఆచార్య సినిమాకి కూడా ఆయనే నిర్మాతగా వ్యవహరించారు.

Video Advertisement

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు ఈ సినిమాలో కియారా అద్వానీ చరణ్ పక్కన హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది.

కేవలం వీళ్లిద్దరే కాక ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా రాబోతోంది. అంజలి కూడా ఈ సినిమాలో నటిస్తోంది. పాన్ ఇండియా సినిమా కనుక ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ ని రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా టైటిల్ ని ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ నాలుగు టైటిల్స్ పేర్లు వినబడుతున్నాయి. అవే సేనాని, సేనాపతి, సీఈఓ, సైనికుడు. ఈ నాలుగు పేర్లు అయితే ప్రస్తుతం వినపడుతున్నాయి ఈ టైటిల్స్ ని రిజిస్టర్ చేయించారట.ఇదేంటి ఇంత సస్పెన్స్ పెడుతున్నారని నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. సీఈఓ టైటిల్ దర్శక నిర్మాతలకి నచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒక పాటను ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు ఈ పాట కోసం ఐదు కోట్లకి పైగా ఖర్చు చేశారట. ఇందులో చరణ్ చేసిన 80 సెకండ్ల డ్యాన్స్ హైలెట్ గా ఉంటుందని తెలుస్తోంది. పైగా సింగిల్ టేక్ లో డాన్స్ చేయడం విశేషం.


End of Article

You may also like