Ads
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్కిన్ షోకు దూరంగా ఉంటూ అందం మరియు ప్రతిభతో అభిమానులను సొంతం చేసుకుంది. ఫ్యాన్స్ లేడి పవర్ స్టార్ అని పిలుచుకునే సాయి పల్లవి ఇంట్లో పెళ్లి బాజాలు మ్రోగనున్నట్లు తెలుస్తోంది.
Video Advertisement
సాయి పల్లవికి పూజా కన్నన్ అనే చెల్లెలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అక్క పోలికలతో ఉన్న పూజ, ఆమె దారిలోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే తాజాగా తన కాబోయే భర్తని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది. ఆ పోస్ట్ చూసిన వారు ఆమె పై కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సాయి పల్లవి సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉనడకపోయినా, ఆమె సోదరి పూజా కన్నన్ మాత్రం ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. పూజ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సాయి పల్లవికి, తనకు, సంబంధించిన ఫోటోలను పూజ షేర్ చేస్తుంటుంది. ఆమె తన అక్క దారిలోనే సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. 2021లో విడుదలైన కోలీవుడ్ మూవీ ‘చిత్తిరాయి సెవ్వానం’ అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. సముద్ర ఖని కీలక పాత్రలో నటించాడు. ఆ సినిమా తరువాత పూజాకన్నన్ సినిమాల పై దృష్టి పెట్టలేదు.
సాయి పల్లవి పెళ్లి విషయం గురించి బయటకు రాలేదు. అయితే పూజాకన్నన్ తాజాగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. అతనితో ఉన్న వీడియోను షేర్ చేస్తూ ” నా అందమైన లిల్ బటన్ నిస్వార్థంగా ప్రేమించడం, సహనం, ప్రేమలో స్థిరంగా ఉండటం మరియు మనోహరంగా ఉండటం నేర్పించాడు. ఈ వినీత్ నా సూర్య కిరణం. క్రైమ్‌లో నా పార్ట్నర్, ఇప్పుడు, నా లైఫ్ పార్ట్నర్” అంటూ రాసుకొచ్చింది.
ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే కొందరు నెటిజెన్లు మాత్రం అక్క కన్నా ముందే పెళ్లిచేసుకుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే అందులో తప్పు ఏం ఉందని ఆమె పై అలా కామెంట్స్ చేస్తున్నారు. అలా ఎంతోమంది పెళ్లి చేసుకున్నారు. ఈరోజుల్లో ఇలాంటివి సర్వసాధారణం.
https://www.instagram.com/p/C2HlFAvxBXj/
Also Read: గుంటూరు కారం సినిమాలో ఈ పొరపాటు గమనించారా..? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?
End of Article