సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్యులు సైతం తమ ప్రతిభను రీల్స్, షార్ట్స్‌  రూపంలో ప్రదర్శించి పాపులర్ అవుతున్నారు. అయితే అందరికీ పాజిటివ్ ఇమేజ్ వల్ల వచ్చిన క్రేజ్ కాకపోవచ్చు. కొందరు ట్రోలింగ్ మరియు  నెగెటివ్ కామెంట్లతో పాపులర్ అవుతుంటారు. దాంతో నెట్టింట్లో వారికి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడుతుంది.

Video Advertisement

ఇలాంటివారిని మల్లెమాల ప్రొడక్షన్ యూనిట్ తీసుకొచ్చి, శ్రీదేవీ డ్రామా కంపెనీ లాంటి షోలకు తీసుకువస్తుంది. తాజాగా రిలీజ్ అయిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో సోషల్ మీడియాలో పాపులర్ అయిన సింగర్ తో పాడించారు. అయితే ఈ ప్రోమో చూసిన వారు సింగర్ ను తీసుకువచ్చి, పరువుతీస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
గద్వాలకు చెందిన శివ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. శివ పాడే సాంగ్స్ కొద్ది రోజులుగా ఇన్ స్టాగ్రామ్  రీల్స్, మీమ్స్‌, ట్రోల్స్ లో హల్చల్ చేస్తున్నాయి. అతని పాటలను నెటిజెన్లు విపరీతంగా ట్రోల్స్ చేశారు. అలా శివ బాగా పాపులర్ అయ్యాడు. ఆ వ్యక్తిని శ్రీదేవీ డ్రామా కంపెనీ లేటస్ట్ ఎపిసోడ్ కు తీసుకువచ్చారని ప్రోమో ద్వారా తెలుస్తోంది.
అయితే శివతో వేదిక పైన పాట పాడించారు. అతని ప్రతిభను గుర్తించి, అవకాశం ఇచ్చారనుకోవచ్చు.  కానీ శివ పాట పాడుతుంటే, ఇంద్రజ, హీరోయిన్ రేఖ, శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లోని మిగతా వారంత పగలబడి మరి నవ్వారు. ఈ ప్రోమో చూసిన నెటిజెన్లు అతన్ని ఈ ప్రోగ్రామ్ కు తీసుకువచ్చి మరీ పరువు తీయడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటివరకు సోషల్ మీడియాలోను వారు మాత్రమే ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు టెలివిజన్ ఆడియెన్స్ ముందుకు తీసుకువచ్చి పరువు తీసేస్తున్నారని అంటున్నారు. పాడుతుంటే అంతగా నవ్విన ఇంద్రజ ఆ తరువాత ‘నీలో పాడగలను అనే ధైర్యం ఉంది. అందుకే ఇక్కడకు దాకా వచ్చావు, అని మాట్లాడింది. కానీ నవ్వే వారిని మాత్రం ఆపలేదని ప్రోమో చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.

watch video :

Also Read: SKANDA MOVIE: స్కంద ఈవెంట్ లో… “శ్రీలీల” వెనుక ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా..?