తమిళ్ “పోకిరి” లో ఈ సీన్ చూశారా..? మంచి సీన్ ని కామెడీ చేశారుగా..?

తమిళ్ “పోకిరి” లో ఈ సీన్ చూశారా..? మంచి సీన్ ని కామెడీ చేశారుగా..?

by Harika

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు. సినిమాతో పాటు, పాటలు కూడా అంతే పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమాని ఇటీవల మళ్ళీ రిలీజ్ చేసినా కూడా చాలా మంది చూశారు.

Video Advertisement

అంటే, అంతకుముందు సినిమా చూడకుండా ఉండడం వల్ల ఇప్పుడు సినిమా చూడలేదు. సినిమా సెలబ్రేషన్ ఎంజాయ్ చేయడానికి మళ్లీ ఈ సినిమాని చూశారు. ఇండస్ట్రీలో గుర్తుండిపోయే సినిమాలు అని ఒక లిస్ట్ ఉంటుంది. అందులో పోకిరి సినిమా కచ్చితంగా ఉంటుంది.

ఇంత మంచి సినిమాని వేరే ఇండస్ట్రీ వాళ్ళు చూడకుండా ఉంటారా? చూస్తే రీమేక్ చేయకుండా ఉంటారా? చూశారు. రీమేక్ కూడా చేశారు. ఎవరి స్టైల్ లో వాళ్లు రీమేక్ చేశారు. కొంత మంది అయితే కామెడీ కూడా చేశారు. అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది తమిళ్ లో వచ్చిన పోకిరి సినిమా. విజయ్ మంచి నటుడు. కానీ కొన్ని సినిమాలు రీమేక్ చేస్తున్నప్పుడు మాత్రం ఒరిజినల్ సినిమాలతో పోలిక వచ్చి, సినిమాటిక్ లిబర్టీ తీసుకొని వేరే భాషల్లో చేసిన మార్పులు నచ్చకపోతే కామెంట్స్ కూడా అలాగే వస్తాయి. సినిమా రిలీజ్ అయినప్పుడు ఇవన్నీ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని వీటి గురించి బాగానే మాట్లాడుకుంటున్నారు.

Why this is happening with vijay

తమిళ్ లో ఈ సినిమాని విజయ్ హీరోగా పొక్కిరి పేరుతో రీమేక్ చేశారు. అంతకుముందు విజయ్, మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు సినిమా రీమేక్ చేసి తమిళ్ లో చాలా పెద్ద విజయం సాధించారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే చాలా పెద్ద హిట్ అయ్యింది. కానీ ఒరిజినల్ సినిమాతో పోల్చి చూస్తే ఇందులో అభ్యంతరకరమైన సీన్స్ చాలానే ఉంటాయి. అందులో ముఖ్యంగా హీరోయిన్ తో వచ్చే లవ్ స్టోరీ అయితే ఇంకా ఇబ్బందికరంగా రాశారు. అయితే, ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అందులో హీరోయిన్ కి దెబ్బ తగిలితే హీరో హాస్పిటల్ కి తీసుకెళ్తాడు.

comments on tamil pokiri scene

తమిళ్ లో కూడా ఈ సీన్ అలాగే ఉంటుంది. కానీ అక్కడ హీరో మాట్లాడుతూ, పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ లో ఉన్న నీళ్లు తాగుతాడు. హీరో పనీపాటా లేకుండా తిరిగే పోకిరి మాత్రమే కానీ, తెలివి లేని వాడు కాదు కదా. హీరోయిక్ గా తీయాల్సిన సీన్ ని కామెడీ చేసేసారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. ఇప్పటికింకా నా వయసు పాట తమిళ్ వర్షన్ లో హీరో డాన్స్ చేస్తూ మధ్యలో కుక్కలాగా అరుస్తాడు. లిఫ్ట్ సీన్ అయితే అదేదో హీరోయిన్ ని ఏడిపించే సీన్ లాగా ఉంటుంది.

comments on tamil pokiri scene

ఇంక “పద్మావతి హ్యాపీయేనా” అని హీరో వెంటపడుతూ మరి పోలీస్ ఆఫీసర్ ని ఈ ప్రశ్నలు అడుగుతాడు. దానికి ముందు అదేదో మ్యాజిక్ లాంటిది కూడా చేస్తాడు. ఈ సినిమా తమిళ్ లో చాలా పెద్ద హిట్ అయ్యింది. అసిన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి, ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ తప్పు ఏమీ లేదు. డైరెక్టర్ ఏం చెప్తే అది చేశారు. కానీ, “డైరెక్టర్ సీన్స్ ఇలా రాసుకోవడం ఏంటి? అసలు ఫ్లవర్ వాస్ లో ఉన్న నీళ్లు తాగడం ఏంటి?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

watch video :

ALSO READ : 8 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ…”జయసుధ” కొడుకు హీరోగా నటించిన ఈ సినిమాలు ఏంటో తెలుసా?


End of Article

You may also like