“అన్నీ బాగున్న సినిమాలో ఈ ఒక్కటి పెట్టాల్సిన అవసరం ఏంటి..?” అంటూ… కల్కి 2898 ఏ.డీ. మూవీ మీద కామెంట్స్..!

“అన్నీ బాగున్న సినిమాలో ఈ ఒక్కటి పెట్టాల్సిన అవసరం ఏంటి..?” అంటూ… కల్కి 2898 ఏ.డీ. మూవీ మీద కామెంట్స్..!

by Harika

Ads

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏ.డీ. సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ తో పాటు, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటానీ కూడా ఈ సినిమాలో నటించారు. సినిమాలో ఇంకా చాలా మంది నటీనటులు ఉన్నారు. కొంత మంది అతిధి పాత్రలు కూడా చేశారు. వాళ్లెవరో మీరు సినిమా చూసినప్పుడే చూడాలి. అప్పుడే బాగుంటుంది. అయితే, సినిమాకి ఇప్పటికే హిట్ టాక్ వచ్చింది. కానీ ఒక విషయం మీద కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇందులో హీరోకి, దిశా పటానీకి మధ్యలో ఒక పాట ఉంటుంది.

Video Advertisement

Kalki-2898-AD-story

అసలు సినిమాలో ఆ పాట పెట్టాల్సిన అవసరం కూడా లేదు. పాట ఉంది. ఆలా అని దిశా పటానీ పాత్రకి ఏమైనా ప్రాముఖ్యత ఉందా అంటే, అది కూడా లేదు. సగం సినిమా తర్వాత అసలు దిశా పటానీ ఎక్కడికి వెళ్లిపోయారు అనేది కూడా చూపించలేదు. కేవలం పాట కోసం మాత్రమే దిశా పటానీని పెట్టినట్టు అనిపిస్తుంది.  ఉన్న సీన్స్ కూడా ఏదో ఫ్లోలో ఆపినట్టు అనిపిస్తాయి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అని అందరూ అంటున్నారు. సినిమా అన్న తర్వాత చిన్న చిన్న మైనస్ పాయింట్లు ఉండడం అనేది సహజం. కానీ అసలు ఈ పాట ఉన్నా, లేకపోయినా పెద్ద తేడా ఏమి అనిపించదు.

అందుకే ఇలా కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా దీపిక పోషించిన సుమతి పాత్ర గురించి ఇంకా బాగా చూపించి ఉండాల్సింది అని అంటున్నారు. అసలు సుమతి ఎవరు? కాంప్లెక్స్ లోకి ఎలా వెళ్ళింది? ఇవన్నీ కూడా చూపించి ఉంటే సుమతి పాత్ర ఇంకా బాగా అర్ధం అయ్యేది అని అంటున్నారు. మరి కొంత మంది అయితే, ఇవన్నీ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే నెక్స్ట్ సినిమాల్లో చూపిస్తారు ఏమో అని అంటున్నారు. ఏదేమైనా, సినిమా మాత్రం హిట్ టాక్ తో థియేటర్లలో నడుస్తోంది.


End of Article

You may also like