Ads
ప్రతి సంవత్సరం ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు విడుదల అవుతాయి. అందులో కొన్ని సినిమాలు చాలా పెద్ద హిట్ అవుతాయి. ఆ సినిమాలు హిట్ అయినంత మాత్రాన అందరికీ నచ్చాలి అని గ్యారెంటీ లేదు. చాలా పెద్ద హిట్ అయిన బాహుబలి, సైలెంట్ గా వచ్చే హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాలు ప్రతి ఒక్కరికి నచ్చే అవకాశం లేదు.
Video Advertisement
ఇవి మాత్రమే కాదు. పెద్ద హిట్ అయిన సినిమాలు అన్నీ కూడా అందరికీ నచ్చాలి అని చెప్పలేము. అలాగే హిట్ కాని సినిమాలు నచ్చలేదు అని కూడా అనలేము. ఎవరి అభిప్రాయం వారికి వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంటుంది. సెలబ్రిటీలు కూడా మనుషులే. అందులోనూ ముఖ్యంగా సినిమా వాళ్ల గురించి చెప్పాలి.
ఎంత సినిమా రంగంలో ఉన్నా కూడా చాలా పెద్ద హిట్ అయిన సినిమా వాళ్లకి నచ్చాలి అనే నియమం లేదు. ఇటీవల అలా చాలా పెద్ద హిట్ అయిన ఒక సినిమా గురించి ఒక పెద్ద ప్రొడ్యూసర్ చేసిన కామెంట్స్ డిస్కషన్ కి గురి అయ్యాయి. స్టార్ హీరోలతో పాటు, యంగ్ హీరోలతో ఎన్నో సినిమాలు నిర్మిస్తూ హిట్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ అయిన సూర్యదేవర నాగ వంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో సూర్యదేవర నాగ వంశీతో పాటు కలర్స్ స్వాతి, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ, ప్రియదర్శి, విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు కూడా పాల్గొన్నారు.
అయితే సినిమాల గురించి జరిగిన ఈ చర్చలో భాగంగా సూర్యదేవర నాగ వంశీ తనకి సప్త సాగరాలు దాటి లాంటి సినిమాల మీద ఆసక్తి లేదు అన్నారు. అందుకు కారణం చెబుతూ, ఇవన్నీ ట్రాజిక్ సినిమాలు అని, జీవితంలో ఉన్న ట్రాజెడీ చాలదు అన్నట్టు ఇలాంటి సినిమాలు చూస్తే అలాంటి ఆలోచనలు ఇంకా ఎక్కువగా వస్తాయి అనే ఉద్దేశంతో చెప్పారు. సప్త సాగరాలు దాటి ఇటీవల విడుదల అయ్యి, చాలా పెద్ద హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అంతే కాకుండా సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఆదికేశవ సినిమా లాజిక్ లేని సీన్స్ తో నిండిపోయింది అనే విషయం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దాంతో, “అలాంటి సినిమాలని నిర్మిస్తారు కానీ, ఇంత మంచి సినిమాలు మీకు నచ్చవా?” అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఒక సారి పరిశీలించి చూస్తే ఆయన చేసిన దాంట్లో తప్పు ఏముంది? సప్త సాగరాలు దాటి సినిమా నచ్చని వాళ్ళు ఎంతో మంది ఉండే ఉంటారు. సినిమా లవ్ స్టోరీ అయినా కూడా చాలా నిదానంగా నడుస్తుంది. కొన్ని సీన్స్ మరీ ఎమోషనల్ గా ఉంటాయి. అలాగే కొన్ని సీన్స్ చాలా డ్రాగ్ చేసినట్టు కూడా ఉంటాయి. ఫాస్ట్ స్క్రీన్ ప్లే సినిమాలని ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది.
సినిమా చూస్తే ఒక హ్యాపీనెస్ రావాలి. లేకపోతే ఒక మంచి సినిమా చూసాం అన్న ఫీల్ రావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి బాధలు ఎక్కువగా చూపించే సినిమాల మీద ఆసక్తి చూపించరు. అంతే కాకుండా ఎవరి అభిప్రాయం వాళ్లది. వారు ఎలాంటి సినిమాలు నిర్మించారు అనే విషయాన్ని పక్కన పెడితే, వారికి వ్యక్తిగత భావాలు ఉంటాయి. దాన్ని గౌరవించడం కూడా ముఖ్యమైనదే కదా? ఇంత ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇదే విషయాన్ని నాగ వంశీకి మద్దతు చేస్తూ ఎంతో మంది నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.
ALSO READ : హీరోయిన్ సంఘవి మొదటి పెళ్లి గురించి తెలుసా..? వాళ్ళు ఎందుకు విడిపోయారు అంటే..?
End of Article