హీరోయిన్ సంఘవి మొదటి పెళ్లి గురించి తెలుసా..? వాళ్ళు ఎందుకు విడిపోయారు అంటే..?

హీరోయిన్ సంఘవి మొదటి పెళ్లి గురించి తెలుసా..? వాళ్ళు ఎందుకు విడిపోయారు అంటే..?

by kavitha

సినీ ఇండస్ట్రీలోని వారి జీవితాలు తెరిచిన పుస్తకం లాంటివి. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వల్ల బయటికి తెలియని వ్యక్తిగత విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. సహజంగానే హీరోహీరోయిన్ల పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు.

Video Advertisement

హీరో హీరోయిన్లలో చాలామందికి రెండు, మూడు వివాహాలు జరిగాయి. కానీ కొందరి పెళ్ళిళ్ళ గురించి మాత్రమే వార్తలు తెలుస్తుంటాయి. సోషల్ మీడియా రాకతో కొందరి పెళ్లిళ్లకు సంబంధించిన విషయలు దాచినా ఎలాగోలా బయటకు వస్తున్నాయి. అలా తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ సంఘవి ఫస్ట్ పెళ్లి గురించిన వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
హీరోయిన్ సంఘవి తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో టాప్ హీరోయిన్ గా స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు.  1993 నుండి 2004 వరకు సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్లలో ఒకరు. 15 ఏళ్ళ పాటు సాగిన సంఘవి కెరీర్‌లో 80కి పైగా సినిమాలలో నటించింది. సంఘవి కర్ణాటకలోని మైసూర్‌లో 1977 లో అక్టోబర్ 4న  జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్. రమేష్, మైసూర్ మెడికల్ కాలేజీలో ఈఎన్టి ప్రొఫెసర్ , మరియు ఆమె తల్లి శ్రీమతి రంజన.
సంఘవి బాలనటిగా సినిమాలలో నటించడం మొదలుపెట్టింది. సంఘవి నాయనమ్మకు ప్రముఖ కన్నడ నటి ఆరతి, చిన్న చెల్లెలు. సంఘవి ఆమెతో పాటు  షూటింగ్స్ కు వెళ్ళేది. అలా సినిమాలలో నటించాలన్న ఆసక్తి ఏర్పడింది.  1993లో తమిళ సినిమా అజిత్ హీరోగా వచ్చిన ‘అమరావతి’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీతో ఆమెకు గుర్తింపు వచ్చింది. వరుస ఆఫర్స్ రావడంతో అక్కడ స్టార్ హీరోయిన గా మారారు. శ్రీకాంత్ హీరోగా నటించిన తాజ్ మహల్ మూవీతో సంఘవి టాలీవుడ్ లో అడుగుపెట్టారు.
సిందూరం, సూర్యవంశం అవంతి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. కెరీర్ లో రాణిస్తున్న దశలో 1998లో శివయ్య మూవీలో నటించింది. ఆ మూవీ సమయంలో  ఆ మూవీ డైరెక్టర్ సురేశ్ వర్మను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.  పెళ్ళైన ఏడాదికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఆ తరువాత 2016 లో  బెంగుళూరుకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ వెంకటేష్‌ని రెండవ పెళ్లి చేసుకుంది. ఈ జంటకు జనవరి 2020లో ఆడపిల్ల జన్మించింది.

Also Read: ఫ్యామిలీతో కలిసి చూడలేనని రాజశేఖర్ కూతురు వదులుకున్న ఆ మెగా హీరో సినిమా ఏంటో తెలుసా.?

 

 


You may also like

Leave a Comment