ఫ్యామిలీతో కలిసి చూడలేనని రాజశేఖర్ కూతురు వదులుకున్న ఆ మెగా హీరో సినిమా ఏంటో తెలుసా.?

ఫ్యామిలీతో కలిసి చూడలేనని రాజశేఖర్ కూతురు వదులుకున్న ఆ మెగా హీరో సినిమా ఏంటో తెలుసా.?

by Mounika Singaluri

యాంగ్రీ యంగ్ మాన్ గా రాజశేఖర్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. తన వైవిధ్యమైన మేనరిజమ్స్ తో రాజశేఖర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన శైలిలో ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు.తాజా గా యంగ్ హీరోస్ సినిమాల్లో కూడా ఇంపార్టెంట్ రోల్స్ చేయడానికీ రెడీ అయ్యారు..ఇక రాజశేఖర్ ఫ్యామిలీ విషయానికి వస్తే అయన ఇద్దరి కూతుర్లు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ లు ఇద్దరు హీరోయిన్లుగా తెలుగు సినిమాలో ఎంట్రీ ఇచ్చారు.

Video Advertisement

శివాత్మిక దొరసాని సినిమా తో ఎంట్రీ ఇవ్వగా, శివాని తేజ సజ్జ పక్కన అద్భుతం సినిమా తో డెబ్ల్యూ ఇచ్చారు. అయితే తాజాగా శివాని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన కోటబొమ్మాలి సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది.

Shivani Rajasekhar movies

అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న శివాని కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకుంది.అయితే మెగా హీరో వైష్ణవ్ తేజ్ డబ్ల్యూ మూవీ ఉప్పెన సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటించింది. అయితే కృతి శెట్టి కంటే ముందు ఇందులో హీరోయిన్ గా శివానిని ఎంపిక చేశారట. అయితే ఉప్పెన కథలో ముందుగా బో-ల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండడం వలన ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. తన కుటుంబంలో కలిసి చూడగలనా లేదా అనేది డిసైడ్ చేసుకున్న తర్వాతే కథను ఒప్పుకుంటానని తెలిపారు.

అయితే తనకు చెప్పిన కథకి, ఫైనల్ గా వచ్చిన ఉప్పెన సినిమా కథకి చాలా డిఫరెన్స్ ఉన్నాయని, అందుకే తాను ఆ సినిమా ఒప్పుకోలేదని వివరించారు. ప్రస్తుతం వచ్చిన ఉప్పెన కథ అయితే తాను ఖచ్చితంగా చేసే దానిని అన్నారు. అయితే కోటబొమ్మాలి సినిమా తనకి మంచి గుర్తింపును తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో పక్క తన చెల్లెలు శివాత్మిక కూడా పలు సినిమాలతో బిజీగా ఉందని, ఇద్దరం మంచి సినిమాలు చేసి జీవిత రాజశేఖర్లకు మంచి పేరు తీసుకురావాలని అనుకున్నట్లుగా తెలిపారు.

Also Read:అంత మంచి నటుడికి…వైష్ణవ తేజ్ “ఆదికేశవ”లో ఇలాంటి పాత్ర ఇచ్చారు ఏంటి.?


You may also like

Leave a Comment