“దేవుడి ముందు ఇలాంటి పనులు చేయడం అవసరమా..?” అంటూ… “వితిక షేరు” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

“దేవుడి ముందు ఇలాంటి పనులు చేయడం అవసరమా..?” అంటూ… “వితిక షేరు” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

by Mounika Singaluri

Ads

నటి వితిక షేరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని కూడా షేర్ చేసుకుంటారు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా చాలా మందికి చేరువ అయ్యారు. ఎన్నో సినిమాల్లో నటించి, తర్వాత బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వచ్చి, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఇంకా పాపులారిటీ సంపాదించుకున్నారు.

Video Advertisement

ప్రతి ఆదివారం ఒక వీడియో షేర్ చేస్తూ ఉంటారు. దానికి కొన్ని లక్షల్లో వ్యూస్ వస్తాయి. మనుషులకి మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యం అనేది కూడా సోషల్ మీడియా ద్వారా చెప్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు వితిక చేసిన ఒక పోస్ట్ కి కామెంట్స్ వస్తున్నాయి. వితిక ఈషా ఫౌండేషన్ కి వెళ్లారు. అక్కడ తాను ఒక రోజులో ఏం చేశారో చెప్తూ దినచర్యని కూడా షేర్ చేస్తూ ఉన్నారు.

vithika sheru instagram saree photos

అయితే, ఇవాళ వితిక నటి దివ్యశ్రీ తో కలిసి ఒక డాన్స్ వీడియో షేర్ చేశారు. ఈషా ఫౌండేషన్ లో ఉన్న శివుడి ప్రతిమ ముందు వీరు డాన్స్ వేశారు. దీనికి కామెంట్స్ వస్తున్నాయి. “దేవుడి ముందు ఇలా డాన్స్ చేయడం ఏంటి?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ చాలానే వస్తున్నాయి. వారి డాన్స్ మామూలుగానే ఉంది. అయినా కూడా, దేవుడి ముందు అలా చేయడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరొక పక్క, “శివుడిని నటరాజ అని కూడా అంటారు” అని వితిక కి మద్దతు పలుకుతూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

comments on vithika sheru latest video post

“డాన్స్ చేయడం బాగానే ఉంది కానీ, శివుడి పాటకి డాన్స్ వేయాల్సింది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీటన్నిటిపై వితిక స్పందించి ఈ విధంగా అన్నారు. “ఇలా నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ళందరూ కూడా వారి జీవితంలో సంతోషంగా లేరు. నేను సంతోషంగా ఉండడం చూడలేకపోతున్నారు. మీరు అలాంటి వారిలో ఒకరు అయితే నన్ను బ్లాక్ చేసేయండి. నేను ఎవరి కోసం మారను. నేను ఇలాగే నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తాను. శివుడి ముందు నాట్యం చేయడంలో తప్పు ఏమీ లేదు. ఆయనని నటరాజు అని కూడా అంటారు” అంటూ వితిక కామెంట్ చేశారు. ఈ వీడియో చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.

watch video :

ALSO READ : శ్రీలీలతో పాటు… ఈ ఫోటోలో ఉన్న మరొక ప్రముఖ సీనియర్ స్టార్ నటి ఎవరో తెలుసా..?


End of Article

You may also like