కెజిఎఫ్ లో “వానరం” క్యారెక్టర్ లో ఇది గమనించారా.? ఆ తెలుగు సినిమాలోని క్యారెక్టర్ గుర్తొచ్చిందా.?

కెజిఎఫ్ లో “వానరం” క్యారెక్టర్ లో ఇది గమనించారా.? ఆ తెలుగు సినిమాలోని క్యారెక్టర్ గుర్తొచ్చిందా.?

by Sunku Sravan

Ads

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన మూవీ కే జి ఎఫ్. దర్శకుడు ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ చాప్టర్ 1 తీసినప్పుడు ఎవరికీ అంతగా అర్థం కాలేదు. ఆ సినిమా విడుదలై కొద్దిరోజులకు మూవీ గురించి విపరీతంగా వార్తలు వచ్చాయి. జనాల్లో చాలా వరకు వెళ్లి పోయింది. అప్పటివరకు కేజీఎఫ్ యస్ అంటే ఎవరికీ తెలియదు. కే జి ఎఫ్ 1 తర్వాత యష్ తెలుగు ఇండస్ట్రీలో కూడా పరిచయమయ్యాడు. ఈ సినిమా గోల్డ్ మైన్స్ అనే కథాంశంతో సాగుతుంది. గోల్డ్ మైన్స్ లో పని చేసే వారిని బానిసలుగా చేసుకొని గరుడ కేజిఎఫ్ ని రూల్ చేస్తాడు.

Video Advertisement

ఈ సందర్భంలో గరుడ కింద ప్రధాన అనుచరుడు వానరం. ఈయన గరుడ ఏమి చెబితే అది చేస్తాడు. ఆ కేజిఎఫ్ సింహాసనానికి బానిస వానరం. కేజిఎఫ్ మొదటి పార్టులో ఆ గరుడని అటాక్ చేయడం కోసం రాఖీ బాయ్ వస్తాడు. కానీ వానరం రాఖీ బాయ్ మీద ఎటాక్ చేస్తాడు. ఇలా సినిమా మొదటి పార్ట్ ముగుస్తుంది. సెకండ్ పార్ట్ లో హీరో రాఖీ బాయ్ కే జి ఎఫ్ ను ఎలాగైనా సాధించాలని గరుడని చంపి కేజిఎఫ్ ను ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు.

దీంతో ఆయన కింద ఉన్న వానరం రాఖీ భాయ్ కి బందీ అవుతాడు. రాఖీని అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ల మీద కూడా వానరమే ముందుగా ఫైట్ చేసి రాఖీ భాయ్ కి బానిసగా మారతాడు. అయితే కేజిఎఫ్ ని ఎవరు పాలిస్తే వారికి బానిస వానరం అవుతాడని ఈ సినిమాలో అర్థమవుతుంది. అదేవిధంగా బాహుబలి సినిమాలో కట్టప్ప కూడా ఈ విధంగానే రాజ్యాన్ని పాలించే రాజమాత ఏది చెబితే అది చేస్తాడు. మొదటి పార్టు లో బల్లాల దేవా రూలింగ్ లోకి వచ్చాక కట్టప్పను పిలిచి బాహుబలిని చంపమని చెబుతాడు. దీంతో కట్టప్ప బాహుబలి ని పొడుస్తాడు.

ఈ విధంగా మొదటి పార్టు ముగుస్తోంది. రెండో పార్టీలో బాహుబలి రాజ్యాధికారాన్ని చేపడతాడు. దీంతో కట్టప్ప ఆయనకు బానిస గా మారి బాహుబలి పై ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే వారిని కట్టప్ప ముందుగా అడ్డుకొని అటాక్ చేస్తాడు. ఇలా రెండు పాన్ ఇండియా సినిమాల్లో ఇద్దరు స్టార్ డైరెక్టర్లు కే జి ఎఫ్ లో వానరాన్ని, బాహుబలిలో కట్టప్ప ను ఒక ప్రత్యేక పాత్రలో చూపించారని చెప్పవచ్చు.

 


End of Article

You may also like