“అల వైకుంఠపురంలో” మరియు “జులాయి” లో హీరోయిన్ పని చేసే ఈ ఆఫీస్ ఎప్పుడైనా గమనించారా.?

“అల వైకుంఠపురంలో” మరియు “జులాయి” లో హీరోయిన్ పని చేసే ఈ ఆఫీస్ ఎప్పుడైనా గమనించారా.?

by Mohana Priya

Ads

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా అల వైకుంఠపురంలో. 2020 మొదటిలో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అల్లు అర్జున్ పర్ఫామెన్స్, త్రివిక్రమ్ డైలాగ్స్, తమన్ అందించిన సంగీతం, కొరియోగ్రఫీ ఇలా సినిమాలో ఉన్న ప్రతి అంశం ప్లస్ పాయింట్ అయ్యాయి. ఈ సినిమా పాటలు అయితే యూట్యూబ్ లో రికార్డుల సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.

Video Advertisement

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా 2012లో వచ్చిన జులాయి. ఈ సినిమా కూడా మంచి ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమా సోనూ సూద్ ని మనకి మరింత చేరువ అయ్యేలా చేసింది. జులాయి సినిమా కి కామెడీ కూడా ఇంకొక ప్లస్ పాయింట్. సినిమా వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ జులాయి సినిమా టీవీ లో టెలికాస్ట్ చేస్తే చాలా మంది చూస్తారు. ఏ ఛానల్ లో టెలికాస్ట్ చేస్తారో అందరికీ తెలిసే ఉంటుంది.

జులాయి సినిమా కి, అల వైకుంఠపురం లో సినిమా కి ఒక కామన్ పాయింట్ ఉంది. ఆ కామన్ పాయింట్ త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్, లేదా రెండు సినిమాల్లో నటించిన నటులు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు, తనికెళ్ల భరణి గారు అయ్యుండొచ్చు అని మీలో కొంతమందికైనా అనిపించి ఉంటుంది. కానీ కాదు. ఈ రెండు సినిమాలకి ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే.

పైన ఉన్న ఫోటో జులాయి సినిమాలోనిది. ఈ సీన్ లో బిట్టు పాత్ర పోషించిన సోనూ సూద్ పిజ్జా డెలివరీ బాయ్ గా ఇలియానా పని చేసే ఆఫీస్ కి వచ్చి బ్రహ్మాజీ దగ్గర పాస్ పోర్ట్ తీసుకొని, ఇలియానాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడు. ఈ సినిమాలో ఇలియానా పని చేసే కంపెనీ పేరు ప్యాక్ యువర్ బ్యాగ్స్.

ఈ ఫోటో అల వైకుంఠపురం లో సినిమా లోనిది. ఇందులో పూజా హెగ్డే పని చేసే కంపెనీ పేరు ప్యాక్ యువర్ బ్యాగ్స్. అదే కంపెనీలో తర్వాత హీరో కూడా చేరతాడు అనుకోండి. అది వేరే విషయం.అయితే ఈ రెండు సినిమాలకి ఉన్న కామన్ పాయింట్ ఏంటో ఈ పాటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది.

జులాయి సినిమాలో ఇలియానా, అల వైకుంఠపురం లో సినిమాలో పూజా హెగ్డే పని చేసే కంపెనీల పేర్లు ఒకటే. అంతే కాకుండా రెండు కంపెనీలు ట్రావెల్ సెక్టార్ కి సంబంధించినవే. రెండు పేర్ల ప్రొనౌన్సియేషన్ (ఉచ్చారణ) ఒకటే లాగా ఉంటుంది కానీ, జులాయి సినిమాలో “Pack Ur Bags” అని ఉంటే, అల వైకుంఠపురం లో సినిమా లో “Pack Your Bags” అని ఉంది. అంతే తేడా.


End of Article

You may also like