“షాక్” నుండి “ఈగల్” వరకు…ఈ 6 రవితేజ సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా..?

“షాక్” నుండి “ఈగల్” వరకు…ఈ 6 రవితేజ సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా..?

by Harika

Ads

సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా బ్యాక్ గ్రౌండ్ లేకపోతే నిలదొక్కుకోవడం కష్టం అని అంటూ ఉంటారు. కానీ అలాంటి వాటిని ఎంతో మంది నటులు తప్పు అని నిరూపించారు. సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే కావాల్సింది బ్యాక్ గ్రౌండ్ కాదు అని, టాలెంట్ అని తమ సక్సెస్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు.

Video Advertisement

అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి, సక్సెస్ అయిన హీరో మాస్ మహారాజా రవితేజ. రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో రవితేజ మరొక డిఫరెంట్ పాత్రని పోషించారు. అయితే రవితేజ పాత సినిమాలకి ఈగల్ సినిమాకి ఒక పోలిక ఉంది.

tiger nageswara rao movie review

ఈగల్” సినిమాలో హీరోయిన్ “కావ్య థాపర్” చనిపోతారు. అంతకుముందు రవితేజ హీరోగా నటించిన కొన్ని సినిమాల్లో కూడా ఇలాంటి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అందులో హీరోయిన్ చనిపోతారు. రవితేజ హీరోగా నటించిన “షాక్” సినిమాలో “జ్యోతిక” చనిపోతారు. “వీర” సినిమాలో “కాజల్ అగర్వాల్” పోషించిన చిట్టి పాత్ర కూడా చనిపోతుంది. “టైగర్ నాగేశ్వరరావు” సినిమాలో కూడా “నుపుర్ సనన్” చనిపోతారు. “డిస్కో రాజా” సినిమాలో “పాయల్ రాజ్‌పుత్” పాత్ర చనిపోతుంది.  ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన “బలుపు” సినిమాలో కూడా “అంజలి” చనిపోతారు. అలా ఈ ఆరు సినిమాల్లో ఈ కామన్ పాయింట్ ఉంది.  మరొక కామన్ పాయింట్ ఏంటి అంటే, ఈ హీరోయిన్స్ చనిపోవడం అనేది ఫ్లాష్ బ్యాక్ లోనే జరుగుతుంది.

5 disco raja

దీని తర్వాత రవితేజ మారిపోవడం, లేదా చంపిన వారిపై పగ తీర్చుకోవడానికి వేరే చోటికి వెళ్లడం వంటివి జరుగుతాయి. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో మిరపకాయ్ సినిమా వచ్చి చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ సినిమా హిందీ సినిమా అయిన రైడ్ సినిమా రీమేక్ గా రూపొందుతోంది అని అన్నారు.

ALSO READ : సినిమా రిలీజ్ అయిన 15 ఇయర్స్ తర్వాత తెలిసిందిగా.? “ఓయ్” అంటే అర్ధం ఇదా.?


End of Article

You may also like