ప్రణీత నటించిన ఈ 3 సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా.? మొదట్లో అలా…క్లైమాక్స్ కి వచ్చేసరికి ఇంకోలా.?

ప్రణీత నటించిన ఈ 3 సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా.? మొదట్లో అలా…క్లైమాక్స్ కి వచ్చేసరికి ఇంకోలా.?

by Megha Varna

Ads

ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ప్రణీత సుభాష్. ఆ తర్వాత బావ సినిమాలో నటించారు. అత్తారింటికి దారేది సినిమాలో ఒక హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత రభస, పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, డైనమైట్, హలో గురు ప్రేమ కోసమే, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాల్లో నటించారు.

Video Advertisement

Pranitha Subhash movies common point

ప్రణీత సుభాష్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, తమిళ్ సినిమాల్లో కూడా నటించారు. భుజ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాతో హిందీ ఇండస్ట్రీలో కూడా అడుగుపెడుతున్నారు ప్రణీత. ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా డైరెక్ట్ ఓటీటీ విడుదల అవ్వబోతోంది. ప్రణీత సుభాష్, నితిన్ రాజు అనే ఒక వ్యాపారవేత్తని మే 30 వ తేదీన పెళ్లి చేసుకున్నారు.

Pranitha Subhash movies common point

ఈ విషయాన్ని ప్రణీత సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మనం ఒకసారి గమనిస్తే ప్రణీత సుభాష్ నటించిన సినిమాల్లో, ఒక మూడు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. అది ఏంటంటే, అత్తారింటికి దారేది సినిమాలో హీరో మొదట ప్రేమించేది ప్రణీతని. కానీ తర్వాత సమంతను ఇష్టపడతాడు.

Pranitha Subhash movies common point

అలాగే రభస సినిమాలో కూడా హీరో మొదట తన మామయ్య కూతురు ప్రణీత అనుకొని, ప్రణీతను ఇష్టపడతాడు. కానీ తర్వాత తన మామయ్య కూతురు ప్రణీత కాదు సమంత అని తెలుసుకుంటాడు. అలాగే హలో గురు ప్రేమ కోసమే సినిమాలో కూడా హీరో రామ్ మొదట ప్రణీతను ఇష్టపడతాడు. కానీ తర్వాత అనుపమ పరమేశ్వరన్ ని ప్రేమిస్తాడు.

Pranitha Subhash movies common point

అంటే పైన చెప్పిన మూడు సినిమాల్లో కూడా, హీరో మొదట ప్రణీత పాత్రని ఇష్టపడి తర్వాత వేరే హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. దాంతో సినిమాల్లో ఇలా జరిగింది అని, కానీ నిజ జీవితంలో ప్రణీత తాను ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకున్నారని ప్రణీతకి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.


End of Article

You may also like